Vastu Tips In Telugu: ఉదయం లేచిన వెంటనే చాలామంది అనేక పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యాయామాలు చేస్తే మరి కొంత మంది మాత్రం బెడ్ పైనే ఉండి కాఫీ తాగుతూ ఉంటారు. ఇక మరికొందరైతే టీవీలో వస్తున్న వార్తలను వీక్షిస్తూ.. అలానే బెడ్ పై ఉండిపోతారు. ఇక మరికొందరైతే న్యూస్ పేపర్ తెలియజేస్తూ వార్తలు చదువుతారు. ఇక యువత అయితే మొదటగా వాట్సప్ ఓపెన్ చేసి వచ్చిన మెసేజెస్, స్టోరీలకు రిప్లై ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా చాలామంది నిద్రలేచిన తర్వాత ప్రతిరోజు కామన్‌గా చేసే పనులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ముఖాన్ని తరచుగా అద్దంలో చూసుకోవడం.
అవును ప్రస్తుతం చాలామంది ముఖాన్ని నిద్రలేచిన వెంటనే బెడ్ పైనుంచి వెళ్ళిపోయి.. అద్దంలో తమ ముఖాన్ని పదేపదే చూసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే ముఖంపై వచ్చే పింపుల్స్ ను కూడా గిచ్చుతూ ఉంటారు. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇలా చేయడం మంచిది కాదట. ప్రతిరోజు ఇలా ఉదయాన్నే అద్దంలో ముఖం పెట్టి చూస్తే అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో ఇలా చేయడం వల్ల అనేక సమస్యలకు దారిది ఇవ్వవచ్చట. నిజానికి ఇలా చేయడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
తెలిపిన వివరాల శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన ముఖం మనం చూసుకోవడం అంత మంచిది కాదట. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చాలామంది బెడ్ రూమ్లలో అద్దాలను పెట్టుకోవడం మానుకుంటారు. అంతే కాకుండా అద్దాలకు సంబంధించిన ఫర్నిచర్‌ను కూడా పెట్టుకోరు. రాత్రి మనం నిద్రించే క్రమంలో అద్దం చుట్టూ అనేక ప్రతికూల శక్తులు తిరుగుతాయట. కాబట్టి ఉదయాన్నే మీరు ముఖాన్ని అద్దంలో చూడడం వల్ల ఆ ప్రతికూల శక్తులు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, ఆరోజు ఎలాంటి పనులు చేసిన అనేక ఆటంకాలు కలుగవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఉదయం పూట నిద్రలేచిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వల్ల సహజంగానే కొన్ని మొటిమలు ముడుతలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉదయాన్నే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేలా చేస్తాయి. అంతేకాకుండా దీనికి కారణంగా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అద్దంలో ఉదయం పూట పదేపదే ముఖాన్ని చూసుకోవడం వల్ల కొంతమందిలో నెగిటివ్ శక్తి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మరికొంతమందిలో సులభంగా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటో నైనా లేదా దేవుడి విగ్రహాన్ని అయినా చూడడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి