Mahalakshmi Yoga: కుంభరాశిలో మహాలక్ష్మి యోగం.. ఈ 3 రాశులవారికి వరం..

Mahalakshmi Yoga: ఈనెలలో శుక్రడు, అంగారకుడు తమ రాశులను మార్చి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి.  ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ధన యోగం ఏర్పడుతోంది. ఇది మూడు రాశులవారికి భారీగా లాభాలను ఇవ్వనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2024, 03:02 PM IST
Mahalakshmi Yoga: కుంభరాశిలో మహాలక్ష్మి యోగం.. ఈ 3 రాశులవారికి వరం..

Venus and Mars Conjunction in Kumbh Rashi in March 2024: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలికలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు నుండి దూరంలో రెండో గ్రహం శుక్రుడు, నాల్గో గ్రహం అంగారకుడు. ఈ నెలలో ఈ రెండు గ్రహాల గమనంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. శుక్రుడు మరియు అంగారకుడు తమ తమ రాశులను విడిచిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో శనిరాశిలో శుక్రుడు, కుజుడు కలయిక ఏర్పడబోతుంది. దీని కారణంగా అరుదైన మహాలక్ష్మి యోగం రూపొందుతోంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు త్వరలో ధనవంతులు కాబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కుంభ రాశి
ఇదే రాశిలో అంగారకుడు మరియు శుక్రుడు కలయిక జరగబోతుంది. దీంతో కుంభరాశి వారు కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. 
వృశ్చిక రాశి
శుక్రుడు మరియు కుజుడు సంయోగం వల్ల వృశ్చిక రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు భారీగా లాభాలను ఇస్తాయి. 
తులా రాశి
మార్చి నెలలో కుజుడు మరియు శుక్రుడు మైత్రి వల్ల తులారాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సక్సెస్ అవుతారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Weekly Lucky - Unlucky Zodiac Sign: ఈ వారం లక్కీ, అన్‌ లక్కీ రాశుల వారు వీరే..

Also Read: Chandra Grahan 2024 effect: హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు పట్టనున్న దరిద్రం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News