Malavya Rajyog 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న శుక్రుడు.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు..

Malavya Rajyog 2023: త్వరలో శుక్రుడు మీనరాశిలో సంచరించడం ద్వారా మాళవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 12:21 PM IST
  • త్వరలో మీనరాశిలో శుక్రుడు
  • మూడు రాశులవారికి భారీగా లాభం
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి
Malavya Rajyog 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న శుక్రుడు.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు..

Malavya Rajyog In Pisces 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో మాళవ్య రాజయోగం ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు. ఈ యోగం ఉన్నవారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వీరికి దేనికీ లోటు ఉండదు. కొత్త ఏడాదిలో మీనరాశిలో శుక్రుడి సంచారం వల్ల 'మాలవ్య రాజయోగం' (Malavya Rajyog) ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభ రాశి (Aquarius): మాలవ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఉద్యోగులు తమకు నచ్చిన ప్లేస్ కు ట్రాన్సఫర్ అవుతారు. చమురు, పెట్రోలియం, ఖనిజాలు మరియు ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో లాభపడతారు.

మకరం (Cancer): ఈ యోగం వల్ల మిమ్మిల్ని అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

కన్యా రాశి (Virgo): మాళవ్య రాజయోగం కన్య రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో చేసే పనులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. 

Also Read: Rahu transit 2023: కొత్త ఏడాదిలో ఈ రాశులవారిని రాహు ఎక్కువగా ఇబ్బంది పెడతాడు... ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News