Venus Transit in December 2022: ధన వర్షం కురిపించేందుకు శుక్రుడు వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి భారీ ఆదాయం!

Venus Transit in Sagittarius 2022 December 5. 2022 డిసెంబర్ 5న శుక్రుడు తన రాశిని మార్చుకుని.. ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం ఈ 4 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 1, 2022, 08:59 PM IST
  • ధన వర్షం కురిపించేందుకు శుక్రుడు వచ్చేస్తున్నాడు
  • డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి భారీ ఆదాయం
  • జీవితంలో ప్రేమను పొందుతారు
Venus Transit in December 2022: ధన వర్షం కురిపించేందుకు శుక్రుడు వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి భారీ ఆదాయం!

Venus Transit 2022, Venus will enters Sagittarius on 2022 December 5: వేద జ్యోతిషశాస్త్రంలో సంపద మరియు శ్రేయస్సుకు ప్రదాతగా శుక్రుడు పరిగణించబడ్డాడు. శుక్రుడు మనిషికి ప్రేమ, శృంగారం, అందం మరియు ఆకర్షణను ప్రసాదిస్తాడు. శుక్రుడు రాశిచక్రాలను మార్చినప్పుడల్లా మనిషి జీవితంలోని పై అంశాలపై ప్రభావాన్ని చూపుతాడు. 2022 డిసెంబర్ 5న శుక్రుడు తన రాశిని మార్చుకుని.. ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం ఈ 4 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది. ఆ రాశుల వారి సంపద, జీవితంలో ప్రేమను పొందుతారు.

మేషం: 
శుక్రుని సంచారం మేష రాశి వారికి అదృష్టాన్ని అందిస్తుంది. మేష రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో లాభాన్ని పొందుతారు. భారీగా ఆదాయం పెరుగుతుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

వృశ్చికం: 
శుక్రుని సంచారం వల్ల వృశ్చిక రాశి వారి జీవితాల్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. బట్టలు మరియు నగల కోసం షాపింగ్ చేయవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఈ సమయం కెరీర్‌కు కూడా బాగుంటుంది.

సింహం: 
సింహ రాశి వారి ప్రేమ జీవితానికి శుక్ర సంచారం చాలా శుభప్రదం అవుతుంది. భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం అన్వేషించే వారి కల నెరవేరుతుంది. ప్రమోషన్ కోసం వేచిచూసే వారి నిరీక్షణకు తెరపడుతుంది. ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. సీనియర్ల మద్దతు మరియు ప్రశంసలు పొందుతారు.

కుంభం: 
శుక్ర సంచారం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. రుణ విముక్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభకాలం. 

Also Read: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే

Also Read: Weight Loss Tips: రోటీ తింటే బరువు తగ్గుతారా లేదా?.. డైటీషియన్స్ ఏం చెపున్నారంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News