Venus transit 2023: శుక్రుడి సంచారంతో మారనున్న ఈ రాశుల ఫేట్.. ఇందులో మీ రాశి ఉందా?

Venus transit 2023 in leo: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. వచ్చే నెలలో శుక్రుడి రాశి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 12:53 PM IST
Venus transit 2023: శుక్రుడి సంచారంతో మారనున్న ఈ రాశుల ఫేట్.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1.02 గంటలకు కర్కాటకరాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
శుక్ర గ్రహ సంచారం మీకు చాలా లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. మీరు ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. కుటుంబంలోని విభేదాలన్నీ తొలగిపోతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
ధనస్సు రాశి
శుక్రుడి గమనంలో మార్పు ధనస్సు రాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీకు ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. 
కర్కాటక రాశి 
సింహరాశిలో శుక్రుడి ప్రవేశం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్లో ఊహించని  పురోగతి సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Saturn transit 2023: దసరా ముందు నక్షత్రాన్ని మార్చనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

తులారాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. 

Also Read: Budh Gochar 2023: బుధుడు ఒకే సారి రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి బోలెడు లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News