Weekly Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే రాహు కేతు గ్రహాలు ఈ వారం ప్రారంభంలోని సంచారం చేయబోతున్నాయి. దీంతోపాటు శుక్ర గ్రహం కూడా కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి శని ప్రత్యక్షంగా సంచారం చేస్తాడు. ఇలా కొన్ని రాశులు సంచారం చేయడం కారణంగా ఏర్పడిన ప్రత్యక్ష ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ప్రతికూల, సానుకూల ప్రభావాలు చూపుతాయి. అయితే ఈ వారం ఏయే రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ వారం సంబంధాలు మెరుగుపడతాయి. వినూత్న ఆలోచనల కారణంగా వ్యాపారాల్లో కూడా ఈ వారం సులభంగా విజయాలు సాధిస్తారు. మీ ప్రత్యేక నైపుణ్యతను ప్రదర్శించడం వల్ల వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతే కాకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా పొందుతారు. ఇక ఈ సమయంలో ఖర్చుల పట్ల ప్రత్యేక అవగాహనతో ఉండడం చాలా మంచిది. దీంతోపాటు ఆర్థిక నిర్ణయాలపై కూడా ఆలోచిస్తూ ఉండాలి. వృత్తిపరమైన జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈ వారం ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంతోపాటు వీరికి వృత్తిపరంగా కూడా అనేక మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు కొత్త బాధ్యతలను కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ వారం వీరికి ఎలాంటి లోటు ఉండదు. ఇక ఇప్పుడే కెరియర్ ప్రారంభించే వారు పునాదులు బలంగా వేసుకుంటారు.
మిథున రాశి:
మిధున రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే క్రమంలో తప్పకుండా నిపుణుల, సలహాలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యక్తులతో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం ఖర్చులు పెట్టే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈవారం మీరు లక్ష్యాలపై దృష్టి సాధించడం చాలా మంచిది. అంతేకాకుండా సంపద కోసం మీ వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. అయితే కొన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
తులారాశి:
తులా రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కార్యాలయంలో ఒత్తిడి పెరిగి స్వీయ నియంత్రణ కోల్పోయే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. అభివృద్ధి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.