Makara Sankranti 2022 : జనవరి 14న మకర సంక్రాంతి పండుగ ? మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకిలా!

makar sankranti festival, astrologers suggest the perfect date : మకర సంక్రాంతి పండుగ తేదీపై తెలుగు రాష్ట్రాలో అయోమయం. దేశమంతా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలో మాత్రం మరో తేదీని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 03:30 PM IST
  • మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు
  • దేశమంతా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి
  • తెలుగు రాష్ట్రాలో మాత్రం మరో తేదీని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు
  • అయోమయంలో జనం
Makara Sankranti 2022 : జనవరి 14న మకర సంక్రాంతి పండుగ ? మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకిలా!

When will the Makara Sankranti festival, astrologers suggest the date details here : మకర సంక్రాంతి పండుగను దేశం మొత్తం ఒక రోజు నిర్వహించుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరో రోజున నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు మకర సంక్రాంతిని (Makara Sankranti) ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు (Telugu States Governments) మకర సంక్రాంతికి సంబంధించి ప్రకటించిన తేదీని కూడా తప్పుపడుతున్నారు పంచాంగ కర్తలు. (astrologers) జనవరి 14వ (January 14) తేదీనే మకర సంక్రాంతిని జరుపుకోవాలంటూ శాస్త్రాలు సూచిస్తున్నాయని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాలు (Telugu states) జనవరి 15న (January 15) మకర సంక్రాంతి పండగ అంటూ ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ప్రజలు కూడా జనవరి 15న మకర సంక్రాంత్రి నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. 

నగరాల్లో ఉండేవారంతా మకర సంక్రాంత్రిని అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు పల్లెబాట పట్టారు. ఏపీలోని కోనసీమలో ఇప్పటికే పండుగ సంబరాలు మొదలయయ్యాయి. ముగ్గుల పోటీలు, ఎద్దుల పందేలు ప్రారంభమయ్యాయి. భోగిమంటలు వేసేందుకు... పండుగను (Festival) అట్టహాసంగా నిర్వహించుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. 

అయితే ఇప్పుడు మకర సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిన తేదీ (Makara Sankranti date) విషయంలో కాస్త అయోమయం నెలకొంది. అసలు మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలి అని ఆందోళన చెందుతున్నారు తెలుగు ప్రజలు.

Also Read : Makar Sankranti 2022: సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే.. సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు మీ సొంతం

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జనవరి 14న నిర్వహించుకుంటున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం జనవరి 15న (January 15) మకర సంక్రాంతిని నిర్వహించుకోవాలని నిర్ణయించాయి. దీంతో తెలుగు ప్రజల పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ విషయంలో సతమతమవుతున్నారు. అయితే దృగ్గణిత పంచాంగం ప్రకారం.. జనవరి 14న మకర సంక్రాంతి నిర్వహించుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. జనవరి 14వ తేదీనే మకర సంక్రాంతి (Makara Sankranti) జరుపుకునేందుకు సరైన తేదీ అని పంచాంగ కర్తలు స్పష్టం చేశారు. 

Also Read : Horoscope 2022 January 12: ఈ రాశి వారికి గడ్డు కాలం నడుస్తోంది జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News