Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో సుప్రీతి సూపర్ షో..బద్దలైన నేషనల్‌ రికార్డు..!

Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో మరో ఆణిముత్యం మెరిసింది. గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. హర్యానాలోని పంచకులలో జరుగుతున్న పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకు ఎవరా ప్లేయర్..ఏమిటా కథ..

Written by - Alla Swamy | Last Updated : Jun 10, 2022, 03:37 PM IST
  • హర్యానాలో ఖేలో ఇండియా పోటీలు
  • సరికొత్త రికార్డు సృష్టించిన సుప్రీతి
  • 3 వేల మీటర్ల పరుగు పందెంలో ఫీట్
Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో సుప్రీతి సూపర్ షో..బద్దలైన నేషనల్‌ రికార్డు..!

Supriti Kachhap: హర్యానాలోని పంచకులలో ఖేలో ఇండియా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మహిళల 3 వేల మీటర్ల పరుగు పందెంలో సుప్రీతి రికార్డు సృష్టించింది. 9 నిమిషాల 46.14 సెకన్లలోనే రేస్‌ను పూర్తి చేసి ఔరా అనిపించింది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. గతంలో ఈ కేటగిరిలో అత్యుత్తమ రికార్డు 9 నిమిషాల 50.54 సెకన్లుగా ఉంది. దీనిని అధిగమించి సుప్రీతి కొత్త రికార్డు నెలకొల్పింది.  

సుప్రీతి కచ్చప్.. ఛాంపియన్‌గా మారడానికి ఎన్నో అవరోధాలను అధిగమించింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా..తల్లి అండతో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా బుర్హులో ఆమె జన్మించింది. సుప్రీతి తండ్రి రామ్‌సేవక్‌ మెడికల్ ప్రాక్టీసషన్‌గా పనిచేసేవాడు. ఈక్రమంలోనే 2003లో ఆయన మృతదేహం చెట్టుపై కనిపించింది. ఇన్‌ఫార్మర్‌ నెపంతో సుప్రీతి తండ్రిని నక్సలైట్లు చంపేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కనిపించాయి. దీంతో సుప్రీతి తల్లి బాల్మతి దేవి..పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది. ఈక్రమంలో ఆమెకు ప్రభుత్వం చిన్నపాటి ఉద్యోగం కల్పించింది. 

ఉద్యోగ రిత్యా సుప్రీతి ఫ్యామిలీ గుమ్లాకు మారిపోయారు. అక్కడే ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ చదివే క్రమంలో పరుగు పందెంలో పాల్గొంది. ఆ సమయంలోనే ఆమెలోని టాలెంట్‌ను గుర్తించిన కోచ్ రంజన్‌ తివారి ..గురువుగా మారాడు. జార్ఖండ్‌లోని క్రీడా శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇప్పించాడు. అక్కడే కోచింగ్ తీసుకుంటూ జాతీయ ఛాంపియన్‌గా మారింది. సుప్రీతి మొదట్లో  400,800 మీటర్ల పరుగు పందెంపై ఆసక్తి చూపేంది. శిక్షణ అనంతరం 15 వందలు, 3 వేల మీటర్ల దూరం పరుగు పందెంలో పాల్గొనేదని సుప్రీతి కోచ్ రంజన్‌ తెలిపాడు. 

2016 విజయవాడలో జరిగిన జూనియర్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్ షిప్‌లో 15 వందల మీటర్ల పోటీల్లో తొలిసారి సుప్రీతి మెరిసింది. తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ వెంటనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. 2018లో భోపాల్‌లోని సాయ్ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంది. ఈక్రమంలోనే 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో మెడల్ సాధించింది. 2019లో గుంటూరులో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌లో రజత పతకంతో సత్తా చాటింది.

2021లో భోపాల్‌లో నిర్వహించిన ఇండియన్ అండర్-20 ఫెడరేషన్‌ కప్‌లో 5 వేల మీటర్ల పోటీలో తొలిసారి రజతాన్ని సొంతం చేసుకుంది. రజతంతోపాటు మూడు వేల మీటర్ల పందెంలోనూ రజతం సాధించింది. 2022లో అండర్-20 ఫెడరేషన్‌ కప్‌లో మూడు వేల మీటర్ల పోటీలో వెండి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్‌లో 5 వేల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ సాధించింది. ఈక్రమంలోనే కొలంబియాలో జరిగే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌ పోటీలకు అర్హత పొందింది. ఆమె మరిన్ని మెడల్స్ సాధించాలని క్రీడా లోకం కోరుతోంది. 

Also read:Bandi Sanjay on CM Kcr: కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల మోత..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్..!

Also read:TS TET 2022: తెలంగాణ టెట్ పై రగడ.. వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News