IPL 2022 Auction: ఆ క్రికెటర్ కోసం పోటీపడుతున్న మూడు జట్లు.. కెప్టెన్సీ ఇవ్వడానికైనా రెడీ..!

IPL 2022 Auction: రానున్న ఐపీఎల్ మెగావేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ పాట్ కమిన్స్‌ను దక్కించుకొనేందుకు మూడు జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 03:32 PM IST
IPL 2022 Auction: ఆ క్రికెటర్ కోసం పోటీపడుతున్న మూడు జట్లు.. కెప్టెన్సీ ఇవ్వడానికైనా రెడీ..!

IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి (IPL 2022  Mega Auction) సమయం ఆసనమవుతోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొత్తం 590 మంది ఆట‌గాళ్లు పాల్గొన‌బోతున్నారు. ఇక రానున్న మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ పాట్ కమిన్స్‌ను ( Pat Cummins) ద‌క్కించుకోనేందుకు మూడు జ‌ట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ జట్లే.. ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, పంజాబ్ కింగ్స్.

ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ పేసర్లులో కమిన్స్ ఒకడు. తన బౌలింగ్ తో ఆస్ట్రేలియా (Australia) జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆ నమ్మకంతోనే సెలెక్టర్లు ఆసీసీ టెస్టు కెప్టెన్ గా కమిన్స్ ఎంపిక చేశారు ఆ నమ్మకాన్ని అతడు వమ్ముచేయలేదు. యాషెస్ సిరీస్ లో కెప్టెన్ గా తనదైన ముద్రవేశాడు. ఇంగ్లాండ్ ను 4-0తో ఓడించి.. సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.

ఐపీఎల్ లో మెుదటిసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరుపున బరిలోకి దిగాడు కమిన్స్. ఆ తర్వాత  2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కు మారాడు. 2020లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. ఐపీఎల్ లో కమిన్స్ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అంతమాత్రాన అతడి అంతర్జాతీయ గణాంగాలను విస్మరించలేము. 

Also Read: IPL 2022 Auction: ఆ టీమిండియా ఆటగాడి కోసం.. 20 కోట్లు ఖర్చుచేసేందుకు ఆర్‌సీబీ సిద్ధం! షాక్‌లో ఫాన్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News