Rashid Khan 100 Wickets: అంతర్జాతీయ టీ20ల్లో మలింగ రికార్డును బ్రేక్ చేసిన రషీద్ ఖాన్

Rashid Khan 100 Wickets: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan News) అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్​గా నిలిచాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేశాడు రషీద్ ఖాన్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 02:24 PM IST
Rashid Khan 100 Wickets: అంతర్జాతీయ టీ20ల్లో మలింగ రికార్డును బ్రేక్ చేసిన రషీద్ ఖాన్

Rashid Khan 100 Wickets: టీ20 ప్రపంచకప్​లో పాకిస్తాన్​తో జరిగిన మ్యాచ్​లో అరుదైన ఘనత సాధించాడు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan News). అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన రికార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం 53 మ్యాచ్​ల్లోనే ఈ మార్క్​ను అందుకోవడం విశేషం.

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్​తో మ్యాచ్​ (PAK Vs AFG) సందర్భంగా మహ్మద్ హఫీజ్​ వికెట్​ తీసిన రషీద్​.. 100 వికెట్ల క్లబ్​లో చేరాడు. దీంతో 76 మ్యాచుల్లో 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేశాడు.

పోరాడి ఓడిన అఫ్గాన్..

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో అఫ్గాన్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాక్. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. బాబర్‌ అజామ్‌ (51) కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫకార్ జమాన్ (30), షోయబ్ మాలిక్‌ (19) ఫర్వాలేదనిపించారు. 19వ ఓవర్‌లో ఆసిఫ్‌ అలీ (25) నాలుగు సిక్స్‌లు బాది పాక్‌కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు, ముజీబుర్, నబీ, నవీన్ ఉల్ హక్‌ తలో వికెట్ తీశారు.

Also Read: Afg vs Pak Match Highlights: టీ20లో హ్యాట్రిక్ కొట్టిన పాక్.. ఆఫ్గనిస్తాన్‌పై పాక్ ఘన విజయం 

Also Read: Babar Azam: విరాట్​ కోహ్లీ రికార్డ్​ను బ్రేక్ చేసిన బాబర్ అజామ్​- టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News