టీమిండియా మాజీ కెప్టెన్... 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయానికి రథసారథి కపిల్ దేవ్ రాజకీయ ప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన బీజేపీ నేత అమిత్ షాను కలవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేయమని కపిల్‌ను పలు పార్టీలు కోరినా.. ఆయన తన విముఖతను చూపారు.
అయితే తాజాగా ఆయన రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్‌కి ఎన్నికవుతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా అమిత్ షా, కపిల్‌ను కలిసి బీజేపీకి మద్దతు తెలపమని కోరినట్లు కూడా ఈ క్రమంలో పలువురు సీనియర్ రాజకీయ నాయకులు తెలిపారు. తాజాగా బీజేపీ తమ పార్టీలోనే అంతర్గతంగా ఓ సరికొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టిందని సమాచారం.
ఈ స్కీమ్ ప్రకారం దాదాపు 4000 మంది బీజేపీ నేతలు.. లక్షమంది సెలబ్రిటీలను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ స్కీమ్‌లో భాగంగానే అమిత్ షా తాను 50 మంది సెలబ్రిటీలను కలవాల్సి ఉండగా.. తొలివిడతలో ఆయన మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్‌తో పాటు రాజకీయ నిపుణులు సుభాష్ కశ్యప్‌ని కలిశారని.. ఆ తర్వాత కపిల్‌తో కలిసి మాట్లాడారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
It was wonderful meeting former skipper of Indian cricket team, Shri Kapil Dev ji and his wife at their home in Delhi. As part of the nationwide "Sampark for Samarthan" campaign, briefed him about the achievements of PM @narendramodi’s govt in the last 4 years.@therealkapildev pic.twitter.com/dd3pRni2z3
— Amit Shah (@AmitShah) June 1, 2018