Arshin Kulkarni Hits Fastest Century: ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌దే హవాగా మారింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. ఈగిల్ నాసిక్ టైటాన్ బ్యాట్స్‌మెన్ అర్షిన్ కులకర్ణి ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 7వ మ్యాచ్ పుణెరి బప్పా, ఈగల్ నాసిక్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈగిల్ నాసిక్ టైటాన్ మొదట బ్యాటింగ్ చేయగా.. అర్షిన్ కులకర్ణి చెలరేగి ఆడాడు. 54 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌లో 13 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. 216.67 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 90 రన్స్ చేశాడు.
అర్షిన్ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. హైస్కోరింగ్ గేమ్‌లో పుణెరి బప్పా టీమ్‌పై ఈగల్ నాసిక్ టైటాన్స్ జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈగల్ నాసిక్ టైటాన్స్.. అర్షిన్ కులకర్ణి (117) అద్భుత సెంచరీతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 203 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 41 పరుగులతో రాణించాడు.
Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన
భారీ లక్ష్యంతో బరిలోకి పుణెరి బప్పా దీటుగానే సమాధానం ఇచ్చింది. గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగినపోరులో చివరి ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. పుణెరి టీమ్ ఐదు పరుగులు మాత్రమే చేసింది. పుణెరి బప్పా టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఫామ్‌ను రుతురాజ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాడు.
Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి