బాక్సింగ్ డే టెస్టు సీరిస్ భాగంగా పెర్త్ లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటలో కోహ్లీ సేన పై చేయిసాధించింది. గత రెండు టెస్టుల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 (89 ఓవర్లు) పరుగుల చేసింది. ఇదే జోరు రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగితే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం దొరుకుతుంది. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనే రేపు తేలనుంది..
సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్ మెన్లు
ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఎక్కువ శాతం ఢిఫెన్స్ కే ప్రాధాన్యత ఇచ్చింది ..ఓపెనర్లు నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. దీంతో పరుగుల రాబట్టడం కష్టతరం మారింది. యువ ఓపెనర్ 66 బంతులు ఎదుర్కొని 8 పరుగుల వద్ద ఔట్ కాగా..మరో యువ ఓపెనర్ మాయంక్ అగర్వార్ 76 పరుగులతో చేసి ఔట్ అయ్యాడు. నిలకడకు మారుపేరైనా పుజారా(68) ..దూకుడు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విరాట్ కోహ్లీ (47) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలింగ్ విషయానికి వస్తే ఒక్క కమ్మింగన్స్ (2 వికెట్లు) మినహా ఆసీస్ బౌలర్లు ఎవరూ వికెట్ల తీయలేకపోయారు.