Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు

Gautam Gambhir gets death threats: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపుతామంటూ ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్‌ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులకు (Police) సమాచారం అందించాడు గంభీర్ (Gambhir). 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 02:31 PM IST
  • గంభీర్‌ను చంపుతామంటూ ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు
    ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించిన గంభీర్
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు

BJP MP Gautam Gambhir gets death threats from ISIS Kashmir approaches Delhi Police: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపుతామంటూ ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్‌ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులకు (Police) సమాచారం అందించాడు గంభీర్ (Gambhir). బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read : Bumper Offer: రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!

ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపడుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ (Shweta Chauhan) తెలిపారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గంభీర్‌ (Gambhir) 2018లో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గంభీర్ గెలుపొందారు.

Also Read : Kondapalli Municipality Election: హైకోర్టు జోక్యంతో పూర్తైన కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News