Ravindra Jadeja likely be Ruled Out from IPL 2022: ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. గాయాల కారణంగా స్టార్ ప్లేయర్స్ ఒక్కరుగా దూరమవడం, రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ కొత్త కావడంతో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఐపీఎల్ టోర్నీలో నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు 15వ సీజన్లో పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లలో కేవలం నాలుగు విజయాలు అందుకుని పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇది చాలదన్నట్టు చెన్నైకి మరో షాక్ తగలనుందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తప్పుకోనున్నాడని సమాచారం. గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆడని విషయం తెలిసిందే. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ జడ్డూకి ఛాతీపై గాయాలయ్యాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్‌లో చెన్నై ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు (ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్) కూడా అతడు అందుబాటులో ఉండడని ఓ ప్రముఖ క్రీడా ఛానెల్ వెల్లడించింది.
ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. బౌలింగ్‌లో పదును తగ్గడమే కాకుండా.. బ్యాటింగ్‌లో భారీ షాట్లను ఆడలేక ఒత్తిడికి గురయ్యాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోయాడని స్పష్టంగా అర్ధమయింది. ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 116 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా కెప్టెన్సీలో సీఎస్‌కే 8 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 2 గెలిచి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
చెన్నై ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అదే సమయంలో బెంగళూరు (2), రాజస్థాన్ (3) జట్లు తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరగడం దాదాపుగా అసాధ్యమే. టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయం కారణంగా ఐపీఎల్ 2022కి పూర్తిగా దూరమయిన విషయం తెలిసిందే. భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీలు కూడా గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమయ్యారు.
Also Read: Mahesh Babu: మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.