టీమిండియా యువ సంచలనం , క్రికెటర్ శుభమన్ గిల్‌కు మ్యాచ్ రిఫరీ షాకిచ్చాడు. రంజీ మ్యాచ్‌లో భాగంగా తన ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో గిల్ గొడవపడ్డాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంపైర్లపై ఒత్తిడి చేసిన విషయంపై రిఫరీ స్పందిస్తూ.. గిల్ మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్ ఆట నిబంధనలు ఉల్లంఘించడం కారణంగానే మొత్తం ఫీజును కోత విధించినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది...
గత శుక్రవారం ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కొంత సమయానికే మీడియం ఫాస్ట్ బౌలర్ సుబోధ్ భతి వేసిన బంతిని గిల్ ఆడగా కీపర్ క్యాచ్ పట్టి అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ గిల్‌ను ఔట్ ప్రకటించగా అతడు మైదానాన్ని వీడలేదు. తనను నాటౌట్‌గా ప్రకటించాలని అంపైనర్లతో ఒత్తిడి తీసుకొచ్చాడు. స్క్వేర్ లెగ్ అంపైర్‌తో చర్చించిన తర్వాత గిల్‌ను నాటౌట్‌గా ప్రకటించాల్సి వచ్చింది.
గిల్ ఔట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ఢిల్లీ జట్టు నిరాశకు లోనైంది. మైదానాన్ని వీడే సూచనలు కనిపించగా.. అంపైర్లు ఢిల్లీ ఆటగాళ్లకు సర్దిచెప్పారు. అయితే ఈ కారణంగా 10 నిమిషాల సేపు ఆట నిలిచిపోయింది. అయితే యువ ఆటగాళ్లు ఇలా క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించకుండా ఉండాలని రిఫరీ పూర్తి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..