IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కు తాకిన కరోనా వైరస్

ఐపీఎల్ హాట్ ఫేవర్ టీమ్ ( Ipl hot favour team ) చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings ) జట్టుకు కరోనా వైరస్ కలకలం పట్టుకుంది. నిబంధనల ప్రకారం నాలుగోసారి చేయించుకున్న పరీక్షల్లో ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ ప్రారంభించకపోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

Last Updated : Aug 28, 2020, 07:08 PM IST
IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కు తాకిన కరోనా వైరస్

ఐపీఎల్ హాట్ ఫేవర్ టీమ్ ( Ipl hot favour team ) చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings ) జట్టుకు కరోనా వైరస్ కలకలం పట్టుకుంది. నిబంధనల ప్రకారం నాలుగోసారి చేయించుకున్న పరీక్షల్లో ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ ప్రారంభించకపోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

ఐపీఎల్ 2020 ( Ipl 2020 ) మరి కొన్నిరోజుల్లో యూఏఈ ( UAE ) వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం టోర్నీలో పాలుపంచుకుంటున్న 8 జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే మ్యాచ్ షెడ్యూల్  మాత్రం ఇంకా వెలువడలేదు. బీసీసీఐ ( BCCI Protocol ) నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం ప్రాక్టీస్ కు ముందు మూడు-నాలుగు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid tests ) చేయించుకున్నారు.నాలుగోసారి పరీక్షల్లో ఐపీఎల్ లో అతిపెద్ద ఫ్రాంచైజ్ గానే కాకుండా హాట్ ఫేవరేట్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఏకంగా పదిమందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది. ఆ పదిమంది ఎవరనేది అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ప్రాక్టీస్ ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. 

ఈ కారణంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు స్వీయ నిర్బంధ కాలాన్ని సెప్టెంబర్ 1 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సెల్ఫ్ క్వారెంటైన్ ( Self Quarantine ) లోనే ఉండనుంది. కరోనా కారణాల దృష్ట్యా  బీసీసీఐ మ్యాచ్ షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మినహా మిగిలిన జట్టు మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాయి. Also read: KEVIN O’BRIEN: భారీ సిక్స్ తో సొంత కారు అద్దం ఇలా బ్రేక్ చేశాడు

Trending News