ENG Vs NZ World Cup 2023 Updates: వరల్డ్ కప్ వేట మొదలు.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. కీలక ప్లేయర్లు ఔట్

England Vs New Zealand Toss and Playing 11: ప్రపంచకప్ వేట మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బిగ్‌ఫైట్‌కు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్ల వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 5, 2023, 02:42 PM IST
ENG Vs NZ World Cup 2023 Updates: వరల్డ్ కప్ వేట మొదలు.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. కీలక ప్లేయర్లు ఔట్

England Vs New Zealand Toss and Playing 11: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సంరంభం ఆరంభమైంది. తొలి ఫైట్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో వికెట్ కీపర్ టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్ కూడా ఈ మ్యాచ్‌ ఆడడం లేదు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపుతో వరల్డ్ కప్ వేటను ప్రారంభించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. చివరి ప్రపంచకప్‌ ఫైనల్‌లో రెండు జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరగ్గా.. మళ్లీ అలాంటి ఫైట్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

"పిచ్ సహేతుకంగా కనిపిస్తోంది. తర్వాత బ్యాటింగ్ చేయడం మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. ఒక వారం క్రితం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటగాళ్లు ఒకచోటికి వచ్చారు. దురదృష్టవశాత్తు కేన్ ఇంకా సిద్ధంగా లేడు. ఫెర్గూసన్‌కు కొంత ఇబ్బంది కలిగింది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నారు." అని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు.

టాస్ గెలిచి ఉంటే ముందుగా తాము కూడా ముందుగా బౌలింగ్ చేసే వాళ్లమని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. మంచి వికెట్‌గా కనిపిస్తోందని.. ప్రిపరేషన్ ఓకే అయిందన్నాడు. నాలుగేళ్ల క్రితం సాధించిన ఘనత చాలా గర్వంగా ఉందని చెప్పాడు. బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదన్నాడు. అట్కిన్సన్, టాప్లీ, విల్లీ, స్టోక్స్  తప్ప మిగిలిన టీమ్ ఆడనుందని తెలిపాడు.
 

తుది జట్లు ఇలా..

ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్, కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్.

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News