Ravi Shastri: నేను ఐపీఎల్ వేలంలో ఉంటే.. 15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని: టీమిండియా మాజీ కోచ్

Ravi Shastri reveals His IPL Auction Price Tag. ఐపీఎల్ వేలంలో మీరు ఎంత ధరకు అమ్ముడుపోయేవారు అని అడగ్గా.. తాను క‌చ్చితంగా 15 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయేవాడిన‌ని టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి వెంటనే చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 05:24 PM IST
  • 15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని
  • భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు
  • క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక
Ravi Shastri: నేను ఐపీఎల్ వేలంలో ఉంటే.. 15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని: టీమిండియా మాజీ కోచ్

Ravi Shastri says My IPL Auction Price Tag is Rs 15 Crores: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక క్రికెట్ ఆటగాళ్ల జీవితమే పూర్తిగా మారిపోయింది. అంత‌ర్జాతీయ ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. స్టార్ ప్లేయర్ ఒక సీజన్‌కు ఏకంగా 15-16 కోట్లు తీసుకుంటున్నారు. ఇక అండ‌ర్ 19 క్రికెట్‌లో స‌త్తా చాటిన వారు కూడా 5-6 కోట్ల వరకు పలుకుతున్నారు. బౌలర్, బ్యాటర్, ఆల్‌రౌండర్‌ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుత ఆటగాళ్ల ధరలపై మాజీలు అప్పుడప్పుడు స్పందిస్తూ.. తమ రోజుల్లో ఐపీఎల్ ఉంటే భారీ ధరకు అమ్ముడుపోయేవాళ్లం అని చెపుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి చేరారు. 

తాజాగా ర‌విశాస్త్రి ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. ఐపీఎల్ వేలంలో మీరు ఎంత ధరకు అమ్ముడుపోయేవారు అని అడగ్గా.. తాను క‌చ్చితంగా 15 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయేవాడిన‌ని వెంటనే చెప్పారు. అంతేకాకుండా ఓ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా ఉండేవాడిన‌న్నారు. ఏ విషయం ఎవ‌రిని అడిగినా ఇదే చెబుతార‌ని ర‌విశాస్త్రి పేర్కొన్నారు. ర‌విశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ర‌విశాస్త్రి స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అన్న విషయం తెలిసిందే. భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడారు. టీమిండియాకు ద‌శాబ్ద‌కాలం పాటు ప్రాతినిధ్యం వ‌హించిన శాస్త్రి. 1983లో భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు అన్న విషయం తెలిసిందే. 80 టెస్టుల్లో 35 స‌గ‌టుతో 3830 ప‌రుగులు చేశారు. ఇందులో 11 సెంచ‌రీలు, 12 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 206. బౌలింగ్‌లో 151 వికెట్లు పడగొట్టారు 150 వ‌న్డేల్లో 29 స‌గ‌టుతో 3108 ప‌రుగులు బాదారు. ఇందులో 4 సెంచ‌రీలు, 18 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 109. ఇక పరిమిత ఓవర్లలో శాస్త్రి 129 వికెట్లు తీశారు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక ర‌విశాస్త్రి వ్యాఖ్యాతగా అభిమానులను అలరించారు. 2014లో టీమిండియాకు డైరెక్ట‌ర్‌గా ఎన్నికైన ఆయన హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నారు. ఆయన హయాంలో టీమిండియా ఎన్నో మంచి విజ‌యాలు సాధించింది. ముఖ్యంగా విదేశాల్లో రాణించింది. రెండోసారి కూడా శాస్త్రి ఏకగ్రీవంగా హెడ్ కోచ్‌గా ఎన్నికయ్యారు. గ‌త ఏడాది ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో హెడ్ కోచ్‌గా ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం ముగిసింది. ఇక ఐపీఎల్ 2022తో శాస్త్రి మరోసారి కామెంటేట‌ర్‌ అవతారం ఎత్తారు. 

Also Read: Viral Video: నెత్తిపై బరువైన మూట, మలుపుల రోడ్.. హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కుతున్న యువకుడు!!

Also Read: Rashmika Mandanna Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.. ఎద అందాలు ఆరబోస్తూ..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

Trending News