కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన హషీం ఆమ్లా.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టంచేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హషీం ఆమ్లా.. దక్షిణాఫ్రికా తరపున మొత్తం 124 టెస్ట్ మ్యాచ్‌లు, 181 వన్డేలు, 44 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్న హషీం ఆమ్లా.. ఎంతో మంది మంచి స్నేహితులను కూడా సంపాదించుకున్నానని పేర్కొన్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఆటలో ఇంతకాలం రాణించగలిగానని ఆమ్లా చెప్పుకొచ్చాడు.
#BreakingNews @amlahash today called time on one of the great international careers of the modern era when he announced his retirement from all formats of international cricket. He will continue to be available for domestic cricket as well as the Mzansi Super League. #AmlaRetires pic.twitter.com/l9qgnt0661
— Cricket South Africa (@OfficialCSA) August 8, 2019
ఇటీవల జరిగిన చివరి ప్రపంచ కప్ టోర్నీలో హషీం ఆమ్లా దేశం కోసం చివరిసారిగా క్రికెట్ ఆడాడు. ఆమ్లా రిటైర్‌మెంట్ ప్రకటనను ధృవీకరిస్తూ క్రికెట్ సౌతాఫ్రికా సైతం ఓ ట్వీట్ చేసింది. దేశవాలి క్రికెట్‌తోపాటు ఎంజాన్సీ సూపర్ లీగ్‌కి సైతం ఆమ్లా అందుబాటులో ఉంటాడని క్రికెట్ సౌతాఫ్రికా తన ట్వీట్‌లో వెల్లడించింది.