టీమిండియా మాజీ భారత ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా బాల్ ట్యాంపరింగ్ వివాదంపై స్పందించాడు. తాజాగా ఐసీసీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు 100 శాతం మ్యాచ్ ఫీజు కోతను విధించిన సంగతి తెలిసిందే. అనేకమంది క్రికెటర్లు వారిపై కఠిన చర్య తీసుకోవాలని, వారిపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న ఆశిష్ నెహ్రా జీవితకాల నిషేధంపై కాస్త భిన్నంగా స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పారు.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జట్టులో బౌలింగ్ కోచ్ గా ఉన్న ఆశిష్ నెహ్రాకు ఈ అంశంపై ప్రశ్న అడిగినప్పుడు, ఆయన ఇలా సమాధానం చెప్పారు. "జీవితకాల నిషేధం అన్నమాటకు వస్తే, అది వారికి అన్యాయమే అవుతుంది. ఇది కేవలం వారికి మాత్రమే కాదు, ఏ క్రికెటర్ అయినా ఇది పెద్ద విషయమే. వారు తమ తప్పును తామే అంగీకరించారు. ఈ విషయంలో మీరు వారిని విశ్వాసించాలి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఓ టెస్టు మ్యాచ్ నిషేధం వంటివి గొప్ప శిక్షగా నేను భావిస్తున్నాను. అదే కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్ కు వర్తిస్తుంది' అన్నారు.
Life ban will be really harsh for them. Not just for them, but for any player. You have to give them credit that they admitted their mistake. I think to step down from the captaincy & one test match ban is enough for both the players: Ashish Nehra #BallTampering #Australia pic.twitter.com/q3UGHiZyLQ
— ANI (@ANI) March 26, 2018