చివరి ఓవర్ ఫలితంపై కుల్దీప్ యాదవ్ స్పందన!

రెండో వన్డే ఫలితం డ్రాగా ముగియడంపై స్పందించిన టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్

Last Updated : Oct 25, 2018, 08:50 PM IST
చివరి ఓవర్ ఫలితంపై కుల్దీప్ యాదవ్ స్పందన!

వైజాగ్‌లోని డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డే ఫలితం డ్రాగా ముగియడంపై టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ స్పందించాడు. తనకు తెలిసినంత వరకు తమ బౌలర్లు ఉత్తమమైన ప్రదర్శనే కనబర్చినప్పటికీ చివరి ఓవర్‌లో ఫలితం మాత్రం తమకు అనుకూలంగా లేకపోయిందని కుల్దీప్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. అంతకుమించితే పర్‌ఫార్మెన్స్ పరంగా తమ బౌలింగ్ విభాగం సంతృప్తికరంగానే ఉందని ఆనందం వ్యక్తంచేశాడు. మ్యాచ్ ఫలితం అనంతరం స్టేడియంలో మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

More Stories

Trending News