ICC World Cup 2023: ప్రపంచకప్ 2023 లో పాకిస్తాన్ జట్టు ఏటికి ఎదురీతే పరిస్థితి తెచ్చుకుంది. వరుస ఓటములతో ఉనికే ప్రశ్నార్ధకం చేసుకుంది. అసలు సెమీస్ బరిలోకి చేరడమే కష్టంగా మారింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో మరో పరాజయం మూటగట్టుకుంది. సెమీస్ అవకాశాల్ని దాదాపుగా కోల్పోయినట్టే తెలుస్తోంది.
చెన్నైలోని చిదంబరం స్డేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి సఫారీలే విజయం సాధించారు. పాకిస్తాన్‌కు మరో ఓటమి ఎదురైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లకే ఆలవుట్ అయి 270 పరుగులు చేసింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు మొదట్లో బాగానే ఆడినా ఆ తరువాత వికెట్లు కోల్పోయారు. విజయానికి 4 పరుగుల కావల్సిన ఉండగా చివరి వికెట్ మాత్రమే మిగలడంతో అంతా ఉత్కంఠ రేగింది. చివరికి కేశవ్ మహారాజ్ కొట్టిన బౌండరీతో సఫారీలు గట్టెక్కారు.
పాక్ సెమీస్ ఆశలు ముగిసినట్టేనా
పాకిస్తాన్‌పై విజయంతో సఫారీలు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఆరు మ్యాచ్‌లలో ఐదింట విజయంతో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉండగా ఇండియా కూడా పది పాయింట్లు సాదించినా రన్‌రేట్ కారణంగా రెండవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడవ స్థానంలో, ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంక 5వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ ఆరవ స్థానంలో నిలిచింది. నాలుగో స్థానానికి ఆస్ట్రేలియా, శ్రీలంకలు పోటీ పడే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే గెలిచింది. రన్ రేట్ కూడా మైనస్‌లో ఉంది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు ఐదేసి మ్యాచ్‌లు ఆడటంతో పాకిస్తాన్‌ను దాటేందుకు ఇంకా అవకాశాలు లేకపోలేదు. అందుకే పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపు ముగిసినట్టే తెలుస్తోంది. పెను సంచలనాలు నమోదైతే తప్ప పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం కావు.
Also read: SA vs PAK Highlights: ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా విజయం.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook