World Test Championship: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి పాక్, కివీస్ ఔట్.. భారత్ అవకాశాలు ఇలా..

WTC Points Table 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరుకునేందుకు భారత్‌ మార్గం మరింత సుగమం అయింది. పాకిస్థాన్, కివీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియడంతో ఆ రెండు జట్లు ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను భారత్ డ్రాగా ముగించిన ఫైనల్‌కు చేరుకుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 02:46 PM IST
World Test Championship: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి పాక్, కివీస్ ఔట్.. భారత్ అవకాశాలు ఇలా..

WTC Points Table 2023: పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఎలాంటి ఫలితం లేకుండా డ్రాగా ముగిసింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో కివీస్, పాక్ జట్లు డబ్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే రేసులో ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు ముందంజలో ఉన్నాయి.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరువాత ఫైనల్‌ చేరే జట్లు ఏవో తేలిపోనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు టెస్ట్ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ను భారత్ గెలిస్తే.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌ను కొడుతుంది. ఈ సిరీస్‌ను ఆసీస్‌ గెలిస్తే.. దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుకుంటుంది. ఈ సిరీస్ 2-2తో సమం అయితే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్యే జరగనుంది. 

78.57 శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడగా, మరో 5 ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో సిడ్నీలో దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. భారత్ 14 టెస్టులు ఆడగా.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఇంకా పెండింగ్‌లో ఉంది. మొదటి టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో భారత్‌పై కివీస్ విజయం సాధించి టోర్నీని గెలుచుకుంది.

భారత్ Vs ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్

టెస్ట్ సిరీస్: మొదటి టెస్ట్: 9 నుండి 13 ఫిబ్రవరి (VCA స్టేడియం, నాగ్‌పూర్)

రెండో టెస్టు: 17-21 ఫిబ్రవరి (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)

మూడో టెస్టు: 1-5 మార్చి (HPCA స్టేడియం, ధర్మశాల)

నాల్గవ టెస్ట్: 9 నుంచి 13 మార్చి (నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్)

వన్డే సిరీస్: మొదటి వన్డే: 17 మార్చి (వాంఖడే స్టేడియం, ముంబై)

రెండో వన్డే: 19 మార్చి (వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం)

మూడో వన్డే: 22 మార్చి (MA చిదంబరం స్టేడియం, చెన్నై).

Also Read: Bandi Sanjay: దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం.. బండి సంజయ్ కౌంటర్  

Also Read: Sania Mirza: రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ప్రకటన.. లాస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News