Rohit Sharma becomes number one batter to hit Most sixes in T20 Crikcet: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో నాలుగు సిక్సులు బాదిన రోహిత్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌తో సమానంగా ఉన్న హిట్‌మ్యాన్ .. ఇప్పుడు టాప్‌లోకి దూసుకొచ్చాడు.
రోహిత్ శర్మ 137 అంతర్జాతీయ టీ20లు ఆడి 175 సిక్సర్లు బాదాడు. దాంతో టీ20ల్లో అత్యధికి సిక్సర్ల రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 172 సిక్సర్లతో (121 అంతర్జాతీయ టీ20లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ (124), ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (120), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (119) టాప్ 5లో కొనసాగుతున్నారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ 104 సిక్సర్లతో భారత్ తరపున టీ20ల్లో 100 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఉన్నాడు.
ఇక భారత్ తరఫున అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుల అందుకున్న జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ సమం చేశాడు. ఆస్టేలియాపై 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రోహిత్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాదా, హిట్‌మ్యాన్ 37 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు అందుకున్నారు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (76), విరాట్ కోహ్లీ (58)లు వరుసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్ల జాబితా:
176 - రోహిత్ శర్మ
172 - మార్టిన్ గప్టిల్
124 - క్రిస్ గేల్
120 - ఇయాన్ మోర్గాన్
119 - ఆరోన్ ఫించ్
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుల జాబితా:
76 - సచిన్ టెండూల్కర్
58 - విరాట్ కోహ్లీ
37 - రోహిత్ శర్మ
37 - సౌరవ్ గంగూలీ
Also Read: ఆ సామర్థ్యం రోహిత్ శర్మకు తప్ప మరెవరికీ లేదు: దినేష్ కార్తీక్
Also Read: Samantha Ruth Prabhu Second Marriage: రెండో పెళ్లికి సిద్దమైన సమంత.. ప్రూఫ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.