Virat Kohli: స్పోర్ట్స్ కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి విరాట్ కోహ్లీ.. చాలా రోజుల తర్వాత అంటూ పోస్ట్!

Virat Kohli Drives black sports car in Delhi ahead of India vs Australia 2nd Test. విరాట్ కోహ్లీ తన బ్లాక్ పోర్స్చే కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 15, 2023, 09:37 PM IST
  • ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ఆరంభం
  • స్పోర్ట్స్ కారులో విరాట్ కోహ్లీ
  • చాలా రోజుల తర్వాత అంటూ పోస్ట్
Virat Kohli: స్పోర్ట్స్ కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి విరాట్ కోహ్లీ.. చాలా రోజుల తర్వాత అంటూ పోస్ట్!

Virat Kohli arrived Arun Jaitley Stadium in black sports car: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ చేశాడు. 

దాదాపు ఐదేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో టెస్టు మ్యాచ్‌ జరగబోతోంది. అదే సమయంలో లోకల్ బాయ్ అయిన విరాట్ కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత తాను పుట్టిన గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీ టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల ప్లేయర్స్ తీవ్రంగా సాధన చేస్తున్నారు. కోహ్లీ సైతం అరుణ్ జైట్లీ స్టేడియంలో చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజు కోహ్లీ తన బ్లాక్ స్పోర్ట్స్ కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

భారత జట్టు బస్సు రావడానికి కనీసం అరగంట ముందు విరాట్ కోహ్లీ తన బ్లాక్ పోర్స్చే కారులో అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చాడు. కోహ్లీ కారు దిగి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. నిమిషాల వ్యవధిలో ప్యాడ్ కట్టుకుని నెట్స్ వైపు వెళ్ళాడు. నెట్ బౌలర్ల బౌలింగ్లో సాధన చేశాడు. 'చాలాకాలం తర్వాత ఢిల్లీ స్టేడియం వైపు లాంగ్‌ డ్రైవ్ వెళ్తున్నా. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి. ఢిల్లీ పట్ల వ్యామోహ భావన కనిపిస్తోంది' అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు కారు డ్రైవ్‌ చేస్తున్న ఇమేజ్‌ను పోస్టు చేశాడు. 

నాగ్‌పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కొత్త బౌలర్ మర్ఫీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా మైదానాన్ని వీడాడు. దాంతో సొంత మైదానంలో సెంచరీ సాధించి అభిమానులను అలరించాలని కోహ్లీ భావిస్తున్నాడు. సొంత మైదానంలో సెంచరీ బాదాలని కోహ్లీ ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు. 

Also Read: Flipkart iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. రూ. 46999 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు! ఏమాత్రం ఆలస్యం చేయొద్దు  

Also Read: Poonam Bajwa Pics: మెరూన్ డ్రెస్‌లో పూనమ్ బజ్వా మెరుపులు.. క్లీవేజ్ అందాలను క్లోజజ్‌గా చూపించేంస్తుందిగా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News