India vs New Zealand Washington Sundar Catch: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రాంచీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ అత్యధికంగా 59 పరుగులు చేయగా.. డెవాన్ కాన్వే 52 పరుగులు, ఫిన్ అలెన్ 35 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు. చివర్లో డారెల్ మిచెల్ చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ హైలెట్ అని చెప్పొచ్చు. పవర్‌ప్లేలో సుందర్ రెండు వికెట్లు తీశాడు ఈ ఆల్‌రౌండర్. 35 పరుగులు చేసి మంచి జోరు మీదున్న ఓపెనర్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసి మొదటి దెబ్బ తీశాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చి వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మార్క్ ఛాంప్‌మన్ అదే ఓవర్ చివరి బంతికి డిఫెన్స్ ఆడాడు. కొంచెం ఎత్తులో గాల్లోలేచిన బంతిని డైవ్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతంగా అందుకున్నాడు వాష్టింగ్టన్ సుందర్.
WHAT. A. CATCH 🔥🔥@Sundarwashi5 dives to his right and takes a stunning catch off his own bowling 😎#TeamIndia | #INDvNZ
Live - https://t.co/9Nlw3mU634 #INDvNZ @mastercardindia pic.twitter.com/8BBdFWtuEu
— BCCI (@BCCI) January 27, 2023
సుందర్ క్యాచ్ పట్టిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సుందర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు ఆశలకు కళ్లెంపడింది. అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్.. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగంచుకున్నాడు.
Also Read: Vijayashanthi: ఆ రోజు ఏడ్చాను.. రాక్షసుడు ఎదురయ్యాడు.. టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్
Also Read: Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి