IND Vs PAK Toss and Playing 11: టఫ్ ఫైట్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్.. మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

Pakistan Won The Toss Chose to Bowl First Against India: ఆసియా కప్ సూపర్-4 ఫైట్‌లో ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంచుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయాస్‌ అయ్యర్ దూరమవ్వగా.. కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 10, 2023, 03:01 PM IST
IND Vs PAK Toss and Playing 11: టఫ్ ఫైట్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్.. మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

Pakistan Won The Toss Chose to Bowl First Against India: ఆసియా కప్‌లో మరో బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో నేడు తలపడుతున్నాయి. వరుసగా విజయాలతో పాక్ దూకుడు మీద ఉండగా.. వర్షం కారణంగా భారత్ ఒకే మ్యాచ్‌ పూర్తిగా ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు పరీక్షగా నిలవనుంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందుకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా భావిస్తున్న వెన్నునొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్‌ 11లోకి వచ్చాడు. పాక్ జట్టు నిన్న రాత్రి ప్రకటించిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. 

టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబార్ ఆజం మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. పిచ్‌పై కొంచెం తేమ ఉందని తాను భావిస్తున్నానని.. దీనిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా ఒత్తిడి ఉంటుందన్నాడు. మేము జట్టుగా బాగా ఆడుతున్నామని.. ఆటపై దృష్టి సారించామన్నాడు. 

"మొదట బ్యాటింగ్ చేయాలని చూస్తున్నాను. ముందుగా ఒక సవాలు ఉంటుంది. మేము చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన విధానం మరింత విశ్వాసాన్ని పెంచింది. ప్రతి మ్యాచ్‌ మాకు ముఖ్యమైనది. కానీ ఒక సమయంలో ఒక విషయంపై దృష్టి పెట్టాలి. వర్షం కారణంగా ఇది మాకు సిద్ధం కావడానికి మంచి సమయం దొరికింది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్‌కు ఇప్పుడే వెన్నునొప్పి వచ్చింది. అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Pawan Kalyan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News