IND vs SA 1st ODI Live Score: రాణించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 297

IND vs SA 1st ODI Live Score: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు బ్యాటర్ డస్సెన్ సెంచరీలతో విజృంభించారు. మరోవైపు ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 06:58 PM IST
    • టీమ్ఇండియాతో తొలి వన్డేలో రాణించిన సౌతాఫ్రికా
    • 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 296 పరుగులు
    • సెంచరీలు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా, డస్సెన్
IND vs SA 1st ODI Live Score: రాణించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 297

IND vs SA 1st ODI Live Score: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 రన్స్ చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సెంచరీతో (110 పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డస్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో (129*) నాటౌట్ గా నిలిచాడు. 

ఓపెనర్లు డికాక్ (27) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన మలన్ (6), మార్‌క్రమ్ (4) విఫలమయ్యారు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడినా.. బవుమా, డస్సెన్ మాత్రం స్కోరు బోర్డును నడిపించారు. 

ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు చేసేశారు. నాలుగో వికెట్‌కు 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్ తీశారు.  v

Also Read: Manjrekar - Kohli: కెప్టెన్సీ ముప్పును గ్రహించి.. కోహ్లీ ముందే తప్పుకున్నాడు! సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!

Also Read: Rishabh Pant Test Captain: రోహిత్ శర్మ వద్దు.. టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంతే సరైనోడు: మాజీ క్రికెటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News