అశ్విన్ మ్యాజిక్: మొదట్లో ధీటుగా ఎదుర్కొని..చివర్లో చతికీలపడ్డ సఫారీలు !!

విశాఖ వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య జరగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది

Last Updated : Oct 4, 2019, 06:45 PM IST
అశ్విన్ మ్యాజిక్: మొదట్లో ధీటుగా ఎదుర్కొని..చివర్లో చతికీలపడ్డ సఫారీలు !!

భారత్‌ జరగుుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా ఆడింది.  39/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు...ఎల్గార్, క్వింటన్ డికాక్ అద్భుత పోరాటపటిమతో ఆట చివరికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేశారు. డీన్ ఎల్గార్ (160), వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (111) ల సెంచరీలతో సౌతాఫ్రికాను ఆదుకున్నారు. 

వీరి ప్రదర్శనతో ఒకానొక దశలో సఫారీ జట్టు భారీ స్కోర్ పనియించే దిశలో కనపించింది. భారత్ కు ధీటుగా సమాధానం ఇస్తుందేమో అనిపించింది. కానీ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేయడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అశ్విన్ కు 5 వికెట్లు దక్కాయి. ఫలితాంగా మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.

అయితే భారత్ సాధించిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా ఆ జట్టు 117 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే  దీంతో నాల్గో రోజు కీలకం కానుంది. నాల్గో ఆటలో ఎవరు పై చేయి సాధిర్తరనేది చూడాల్సి ఉంది. 

 

Trending News