IND Vs SA: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌కు కెప్టెన్, స్టార్‌ బౌలర్‌కు విశ్రాంతి.. సఫారీ టీమ్ ఇదే..!

South Africa Announced Squads: టీమిండియాతో టీ20, వన్డే, టెస్ట్‌ సిరీస్‌లకు జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. రెగ్యులర్ కెప్టెన్ బవుమాతోపాటు స్టార్ బౌలర్ కబడా వైట్‌ బాల్‌ ఫార్మాట్‌కు విశ్రాంతినిచ్చింది. మర్క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్టు సిరీస్‌లో బావుమా ఆడనున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 11:50 PM IST
IND Vs SA: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌కు కెప్టెన్, స్టార్‌ బౌలర్‌కు విశ్రాంతి.. సఫారీ టీమ్ ఇదే..!

South Africa Announced Squads: వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి తరువాత.. అదే జట్టుపై టీ20 సిరీస్‌ 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. ఈ సిరీస్‌ విజయం ప్రపంచకప్ ఓటమి బాధను దూరం చేయకపోయినా.. కాస్త ఊరట కలిగించేదే. సిరీస్ మొత్తం టీమిండియా యంగ్ ప్లేయర్లు ఆకట్టుకునే ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టారు. ఇక దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్ సిద్ధమైంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి సఫారీ టూర్ ఆరంభంకానుంది. టీమిండియాతో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. వైట్ బాల్ మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్‌ ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ పేసర్ కగిసో రబడాలకు  టీ20, వన్డేల సెలెక్టర్లు నుంచి విశ్రాంతి ఇచ్చారు. నాండ్రే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 

దక్షిణాఫ్రికా పర్యటనను ఈ నెల 10న కింగ్స్‌మీడ్ స్టేడియంలో మూడు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌తో ప్రారంభించనుంది భారత్. సెయింట్ జార్జ్ ఓవల్‌లో డిసెంబర్ 12న రెండో టీ20, డిసెంబర్ 14న వాండరర్స్ స్టేడియంలో మూడో మ్యాచ్‌ ఆడనుంది. టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ వహరించనున్నాడు. టీ20 సిరీస్‌ తరువాత వన్డే సిరీస్ డిసెంబర్ 17న వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. రెండు, మూడు వన్డేలు డిసెంబర్ 19, 21వ తేదీల్లో జరగనున్నాయి. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26 నుంచి 30 వరకు, జనవరి 3 నుంచి 7 వరకు రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇతర సీనియర్ ప్లేయర్లు జట్టుతో చేరనున్నారు.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ (మొదటి రెండు టీ20లకు), డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్ (మొదటి రెండు టీ20లకు), డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, క్లాసెన్, కెరిచ్స్ మిల్లర్, లుంగీ ఎంగిడి (మొదటి రెండు టీ20లకు), ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాద్ విలియమ్స్.

వన్డే జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, అండైల్ ఫెహ్లుక్వాయో, తబ్రైజ్ స్హమ్సీ, తబ్రైజ్ షమ్సీ, వాండర్ డస్సెన్, కైల్ వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్.

టెస్ట్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబడా, సెయింట్ రబ్స్, కైల్ వెర్రేన్నే.

Also Read: Kishan Reddy: రేవంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించాం.. బీజేపీ ఓటమికి కారణాలు ఇవే: కిషన్ రెడ్డి

Also Read: Cow Kiss Black King Cobra: బ్లాక్‌ కింగ్‌ కోబ్రాను నాలుకతో తాకిన ఆవు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News