VVS Laxman Big Statement on ODI World Cup 2023: 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో బీసీసీఐ సెలక్టర్ల ఆప్షన్లు కఠినతరంగా మారనున్నాయన్నారు. భారత జట్టు బెంచ్ సామర్ధ్యం అత్యంత బలంగా ఉందని లక్ష్మణ్ చెప్పారు. ఈ నెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ స్టాండ్ ఇన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే మ్యాచ్ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... 'బ్యాకప్ కోచ్‌గా బాగానే ఉంది. ఐర్లాండ్ సిరీస్ నుంచి ఈ పద్దతి మొదలైంది. రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా మంచి రెస్ట్ లభిస్తోంది. భారత జట్టుకు సరిపడినంత మంది మంచి క్రికెటర్లు ఉన్నారు. అందరూ భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని సిద్ధమవుతున్నారు. ప్లేయర్స్ మధ్య పోటీ ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌కు మంచి జట్టును ఎంపిక చేయడం బీసీసీఐ సెలక్టర్లకు అంత సులువు కాదు' అని అన్నారు.
'ఒక్కసారి ప్రధాన ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వస్తే.. అవకాశాలు పరిమితం అవుతాయని యువ ఆటగాళ్లకు తెలుసు. ఏదేమైనా యువ ప్లేయర్స్ వారు బాగా ఆడుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. బాగా ఆడిన వారినే ఎంపిక జట్టులోకి చేస్తున్నప్పుడు మంచి ప్రదర్శనతో అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు. మన దగ్గర ఉన్న ట్యాలెంట్‌ను చూస్తే ముచ్చటేస్తోంది' అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే.
Also Read: IND vs PAK: వైరల్ వీడియో.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఎంసీజీ స్టేడియం
Also Read: Extramarital Affairs: సీరియల్ నటితో భర్త రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook