India Vs Austalia 2nd ODI : ఆసీస్ బౌలర్లను చితగొట్టిన కోహ్లీ,ధోనీ ; టీమిండియా బంపర్ విక్టరీ

తొలి వన్డే ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుని సిరీస్ 1-1 తో సమం చేసింది.

Last Updated : Jan 15, 2019, 07:49 PM IST
India Vs Austalia 2nd ODI : ఆసీస్ బౌలర్లను చితగొట్టిన కోహ్లీ,ధోనీ ; టీమిండియా బంపర్ విక్టరీ

అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఉత్కంత భరిరతంగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ కోహ్లీ సెంచరీతో ( 112 బంతుతుల్లో 104 రన్స్ ) కదం తొక్కడంతో ఆసీస్ ఉంచిన లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. 49.2 ఓవర్లు నాల్గు వికెట్లు మాత్రమే కోల్పోయి 299 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. 

ధోనీ ఫినిషింగ్ టచ్...
ఇక మిగిలిన బ్యాట్స్ మెన్లు విషయానికి వస్తే గత మ్యాచ్ కంటే భిన్నంగా ఆడి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోసించాడు. 54 బంతులు ఎదుర్కొన్న ధోనీ 55 పరుగులు రాబట్టాడు. ధోనీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ తో టీమిండియా గెలుపు బావుట ఎగుర వేసింది. ఇదిలా ఉండగా ఓపెనర్లు శిఖర్ ధావన్ మ్యాచ్ ఆరంభంలో ఆసీస్ బౌలర్లపై చెరలేగి ఆడాడు. అయితే తన వ్యక్తిగత 31 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 43 పరుగులు చేసి తన వంతు సాయం అందించాడు. ఇదిలా ఉండగా మిడిల్ ఆర్టర్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాచ్ ముగిసే సమానికి ధోనీ 55 పరుగులు, దినేష్ కార్తీక్ 25 పరుగులతో నాటౌట్ గా నిలవడం గమనార్హం. ఆసీస్ బౌలింగ్ విషయానికి వస్తే జాన్సస్, రిచర్డ్సన్, మార్కస్, మాక్స్ వెల్ తలో ఒక వికెట్ పడగొట్టారు

మార్ష్ చెలరేగినా.. ఓటమి తప్పలేదు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఆసీస్ 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇలా కోహ్లీసేన 299 పరుగుల టార్గెట్ ను చేధించాల్సి ఉంది. షాన్ మార్ష్ సెంచరీ (131) తో కదం తొక్కడంతో ఈ మేరకు స్కోర్ సాధ్యపడింది. స్కోర్ లో దాదాపు సగం వరకు షార్ మార్స్ చేసిన పరుగులే ఉండటం విశేషం. భారత  బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా, షమీ  రెండు వికెట్లు పడగొట్టాడు.

సిరీస్ సమం చేసిన కోహ్లీ సేన

మూడు వన్డేల సిరీస్ లో టీమింయా 1-1 తేడాతో లెవెల్ చేసింది. తొలి వన్డేలో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే..సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే రెండో వన్డేలో సమిష్ఠిగా రాణించి అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితాన్ని శాసించే చిట్ట చివరి మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా సాగనుంది.

Trending News