ఆ పిచ్ లపై టీమిండియాకు చాలా కష్టం.. చాపెల్ సవాల్..

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ఇండియాకు అగ్ని పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్ గుర్తు చేశాడు.

Last Updated : May 9, 2020, 09:49 PM IST
ఆ పిచ్ లపై టీమిండియాకు చాలా కష్టం..  చాపెల్ సవాల్..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ఇండియాకు అగ్ని పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్ గుర్తు చేశాడు. అయితే అప్పట్లో సిరీస్ గెలిచిన భారత్‌కు ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అంత తేలిక కాదని, ఆ సమయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తదితరుల సేవలు ఆస్ట్రేలియాకు అందుబాటులో లేవని, ప్రస్తుతం ఇద్దరి చేరికతో ఆసీస్  బలం చేకూరిందని అన్నారు. 

Also read : 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రానికి 30 ఏళ్లు

ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇండియాకు అంత సులువు కాదని అన్నారు. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో పోరు హోరాహోరీగా సాగనుందని, రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశమని, అంతేగాక లబుషేన్, పాట్ కమిన్స్, వార్నర్, స్మిత్, లియాన్, హాజిల్‌వుడ్, వేడ్, స్టార్క్ తదితరులతో కూడిన ఆస్ట్రేలియా చాలా బలంగా మారిందన్నాడు. ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు చాలా కష్టమన్నాడు. ఫాస్ట్ పిచ్‌లపై తడబడే బలహీనత ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్‌లను ఎదుర్కొవడం అనుకున్నంత తేలికకాదన్నాడు. ఈసారి గెలిస్తేనే ఇక గతంలో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం సాధించిన టీమిండియా ఈసారి కూడా గెలిచి చూపించాలని చాపెల్ సవాల్ విసిరాడు. అప్పుడే తాను భారత్‌ను ప్రపంచ అత్యుత్తమ జట్టుగా పరిగణిస్తానని తెలిపాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News