India vs Australia 3rd Test Day 4 Highlights: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేయగా.. అజింక్య రహానే సేన విజయానికి మరో 309 పరుగులు కావాలి. లేనిపక్షంలో చివరిరోజు ఆలౌట్ కాకుండా భారత్ జాగ్రత్త పడాలి. లేకపోతే ఆసీస్ గడ్డపై మరో టెస్టులో పరాభవం తప్పదు.
407 పరుగుల లక్ష్యంతో భారత(Team India) ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించిన తర్వాత శుభ్‌మన్‌గిల్ (31: 64 బంతుల్లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. ఆసీస్ ఆటగాడు హేజిల్ వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచిచ్చి గిల్ పెవిలియన్ బాట పట్టాడు. ఆపై కుదురుకుని ఆడిన రోహిత్ శర్మ(52: 98 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు.
Also Read: Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
ఓపెనర్‌గా విదేశాలలో తొలి టెస్టు హాఫ్ సెంచరీ చేసిన వెంటనే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ శర్మ(Rohit Sharma) బౌండరీ లైన్ వద్ద మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. మరో వికెట్ పడకుండా పుజారా, రహానే జాగ్రత్త పడ్డారు. దాంతో నాలుగో రోజు ఆట ముగిసింది. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 312/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి భారత్‌కు మొత్తం 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Also Read: HBD Allu Aravind: నిర్మాత అల్లు అరవింద్ గురించి 10 ఈ ఆసక్తికర విషయాలు
లబుషేన్(73: 118 బంతుల్లో 9 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్(81: 167 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యువ ఆటగాడు కామెరూన్ గ్రీన్(84: 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ కాగానే ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు ప్రకటించాడు. ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ (39 నాటౌట్: 52 బంతుల్లో 6 ఫోర్లు) జట్టు స్కోరును వేగంగా నడిపించాడు. అశ్విన్, సైనీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రాలు చెరో వికెట్ తీశారు.
Also Read: Ravindra Jadeja ఫీల్డింగ్ మాయాజాలం.. స్టీవ్ స్మిత్ షాక్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook