ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్‌డేట్స్: టాస్ గెలిచిన జో రూట్

India vs England 2nd Test Day 1 Score live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్‌డేట్స్: లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ఇరు జట్లు. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు, ఫిట్నెస్ సమస్యలు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2021, 04:07 PM IST
ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్‌డేట్స్: టాస్ గెలిచిన జో రూట్

India vs England 2nd Test Day 1 Score live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్‌డేట్స్: లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో వర్షం కారణంగా టాస్ వేయడం కొంత ఆలస్యమవగా.. అనంతరం టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టేన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్ టెస్టు మ్యాచ్‌లో ఉన్న ఫామ్‌ను అలాగే కొనసాగించి రెండో టెస్టులోనూ తొలి రోజే ఆధిక్యం ప్రదర్శించాలని విరాట్ కోహ్లీ అండ్ కో భావిస్తోంది. 

ఇదిలావుంటే, మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ సిరీస్ నుంచి ఔట్ కాగా జేమ్స్ అండర్సన్‌ని ఫిట్‌నెస్ సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయి. స్టార్ ప్లేయర్స్ అయిన బెన్ స్టోక్స్, జోఫ్రా అర్చర్ లాంటి ఆటగాళ్లు లేని ఇంగ్లండ్ (England team against India) జట్టు ఒత్తిడికి గురవుతోంది. 

Also read : Ind vs Eng 2nd test match live score updates: నేటి నుంచే భారత్‌-ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్..లార్డ్స్‌లో ఎవరిది పైచేయి?

భారత జట్టులోనూ రెండో టెస్టులో శార్థుల్ థాకూర్ లేకపోవడం ఒకరకంగా ఇబ్బందికరమైన పరిణామమే. శార్థుల్ థాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ వచ్చి చేరాడు.

LIVE India vs England Score And Updates 2nd Test Day 1: India (Playing XI)- భారత జట్టు ఆటగాళ్లు:
ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టేన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతున్నారు.

LIVE India vs England Score And Updates 2nd Test Day 1: England (Playing XI)- ఇంగ్లండ్ ఆటగాళ్లు:  
ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరపున రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కుర్రన్, ఒలీ రాబిన్సన్ , మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ ఉన్నారు.

Also read : Rashid Khan appeals for Afghanistan : ప్రపంచ నేతలారా! 'మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి': రషీద్ ఖాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News