Ind vs SA 2nd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించడంతో సిరీస్ కైసవం చేసుకోవాలన్న టీమ్ ఇండియా ఆశలకు బ్రేక్ పడింది. మూడు వన్డేల సిరీస్‌లో రెండు జట్టు 1-1తో నిలవగా రేపు జరగనున్న మూడవ వన్డే అత్యంత కీలకం కానుంది. సిరీస్ చేజిక్కించుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్ అది.
సఫారీల గడ్డపై మూడు టీ20ల సిరీస్ సమం అయిన తరువాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. మొదటి వన్డేలో భారీ విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా నిన్న జరిగిన రెండవ వన్డేలో విజయంతో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంది. కానీ ఏ మాత్రం నిలకడ లేని బ్యాటింగ్, వాడి లేని బౌలింగ్ కారణంగా రెండవ వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. ఆతిధ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ 1-1కు సమం చేసింది. రేపు చివరి వన్డే పార్ల్‌లో జరగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొత్తం 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 46.2 ఓవర్లలో 211 పరుగులకు అలవుట్ అయింది. సాయి సుదర్శన్ 62, కేఎల్ రాహుల్ 56 తప్ప మరెవరకూ కనీసం రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు హెన్‌డ్రిక్స్, కేశవ్ మహారాజ్, బర్జర్ రాణించడంతో ఇండియా అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. ఆ తరువాత బరిలో దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా తరపున టోనీ డీ జోర్జి 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అటు హెన్‌డ్రిక్స్ కూడా 52 పరుగులు చేయడమే కాకుండా 2 వికెట్లు పడగొట్టాడు.
Also read: IPL Auction 2024 Live: ఉత్కంఠగా ముగిసిన ఐపీఎల్ వేలం.. జాక్‌పాట్ కొట్టేసిన ప్లేయర్లు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook