కోహ్లీ సేన గెలుస్తుందా..లేదా..?

తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 77 పరుగుల ఆధిక్యాన్ని దాదాపు 400 పరుగులకు పైగా మలచాలని భావించిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 65/2 స్కోరులో ఉండడంతో అవకాశం బాగానే ఉన్నట్లు అందరికీ తోచింది.

Last Updated : Jan 8, 2018, 07:26 PM IST
కోహ్లీ సేన గెలుస్తుందా..లేదా..?

బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా ఆశలు అడియాసలయ్యాయి. అయితే బౌలింగ్‌లో అదే జట్టు బౌలర్లు రెచ్చిపోవడంతో భారత్ పరిస్థతి అయోమయంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 77 పరుగుల ఆధిక్యాన్ని దాదాపు 400 పరుగులకు పైగా మలచాలని భావించిన దక్షిణాఫ్రికా  టీమ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 65/2 స్కోరులో ఉండడంతో గెలుపు అవకాశం బాగానే ఉన్నట్లు అందరికీ తోచింది. అయితే భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు విలవిల్లాడడంతో పరిస్థితి తారుమారైంది.

తొలి సెషన్‌ ముగిసే వరకైనా ఉండలేక 41.2 ఓవర్లకు గాను 130 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. కోహ్లీసేన ముందు గత ఆధిక్యంతో కలుపుకుని 208 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 82 పరుగులకే  ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్‌ ధావన్‌(16), మురళీ విజయ్‌(13), చతేశ్వర పుజారా(4), కోహ్లి(28), రోహిత్‌ శర్మ(10).. ఇలా దిగ్గజాలు అందరూ పెవిలియన్ బాట పట్టారు. భారత్‌ పతనానికి కారణమైన ఆరు వికెట్లలో ఫిలిండర్ మూడు వికెట్లు తీయగా, మోర్కెల్‌ రెండు వికెట్లు తీశాడు. 

 

Trending News