Ind vs SA: సఫారీల గడ్డపై రెండవ టీ20లో టీమ్ ఇండియా పరాజయం

Ind vs SA: వర్షార్పణమౌతుందనుకున్న రెండవ టీ20 మ్యాచ్ ఎట్టకేలకు జరిగింది. టీమ్ ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. సఫారీ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2023, 07:56 AM IST
Ind vs SA: సఫారీల గడ్డపై రెండవ టీ20లో టీమ్ ఇండియా పరాజయం

Ind vs SA: సఫారీల గడ్డపై జరుగుతున్న ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో సఫారీలు ఇండియాను 5 వికెట్ల తేడాతో ఓడించారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగినా ఓవర్ల కుదింపుతో పూర్తయింది. 

ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టీ20ల సిరీస్‌ను 4-1 తో చేజిక్కించుకున్న టీమ్ ఇండియా కుర్రోళ్లు అదే ఉత్సాహంతో సఫారీ సిరీస్‌కు వెళ్లారు. మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. నిన్న మంగళవారం వర్షం అంతరాయం కల్గించినా రెండవ టీ20 జరిగింది. బ్యాటింగ్ అనుకూల పిచ్‌పై టాస్ ఓడిన ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మూడు బంతులు మిగిలుండగా వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

ఆ తరువాత 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152 పరుగులుగా నిర్దేశించారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా మొదటి బంతి నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడటం ప్రారంభించింది. సిరాజ్ మొదటి ఓవర్లో 14 పరుగులు రాగా, అర్షదీప్ రెండవ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి.  ఆ తరువాత కూడా దక్షిణాఫ్రికాకు వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్ 1-0 ఆధిక్యంతో నిలిచారు. 

రింకూ సింగ్ 68 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 56 పరుగులతో ఇన్నింగ్స్ మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. భారత బౌలర్లు తేలిపోవడంతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్‌డ్రిక్స్ 49 పరుగులు, మార్క్ రమ్ 30, పరుగులు చేశారు. రింకూ సింగ్ కెరీర్‌లో అతనికి తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Also read: BCCI: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News