Ind vs SA 2nd Test: ఇండియా దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ నేడు, కేప్‌టౌన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే

Ind vs SA 2nd Test: టీమ్ ఇండియాకు విదేశీ గడ్డపై ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురౌతుంటుంది. ముఖ్యంగా సఫారీల గడ్డపై టెస్ట్ విజయం గగనమైపోయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో నైనా విజయం సాధించి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2024, 10:22 AM IST
Ind vs SA 2nd Test: ఇండియా దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ నేడు, కేప్‌టౌన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే

Ind vs SA 2nd Test: కేప్‌టౌన్ వేదికగా ఇవాళ్టి నుంచి ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పరాజయం పొందిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. మరి పిచ్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.

దక్షిణాఫ్రికాలో ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. కేప్‌టౌన్ వేదికపై ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లు జరిగితే నాలుగింటిలో టీమ్ ఇండియా ఓటమి చెందగా రెండు డ్రాగా ముగిశాయి. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ 8 సార్లు పర్యటించిన టీమ్ ఇండియా ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది. గత రెండు పర్యటనల్లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఇప్పటికే కోల్పోయి 0-1తో వెనుకబడి ఉంది. ఇవాళ జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో అయినా విజయం సాదించి సిరీస్ సమం చేస్తుందా లేక మరోసారి సిరీస్ కోల్పోతుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది. ఇక సొంతగడ్డపై విజయంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసేందుకు బరిలో దిగుతోంది. 

మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్, కోహ్లీ తప్ప మిగిలినవారంతా నిరాశ పరిచారు. యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ విఫలం కావడంతో పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ప్రశ్నార్ధకంగా మారింది. రోహిత్‌కు ఇది చివరి సిరీస్ కానుండటంతో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. గాయం కారణంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరమౌన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఆడనుండటం టీమ్ ఇండియాకు కాస్త అనుకూలాంశం. శార్దూల్ ఠాకూర్ విఫలం కావడంతో ఇవాళ్టి మ్యాచ్‌లో అతడిని కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. మరో పేసర్ ప్రసిద్ధ కృష్ణ కూడా మొదటి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 

ఇక ఇవాళ్టి పిచ్‌ పై పచ్చిక కన్పిస్తోంది. మొదటి రోజు వాతావరణాన్ని బట్టి పేసర్లు ప్రబావం చూపించే అవకాశాలున్నాయి. మూడోరోజు నుంచి బ్యాటింగ్‌కు అనుకూలం కావచ్చు. టెస్ట్ మ్యాచ్ మొదటి మూడ్రోజుల వరకూ వర్ష సూచన లేదు. నాలుగోరోజు నుంచి వర్ష సూచన ఉందని తెలుస్తోంది. 

టీమ్ ఇండియా అంచనా

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

దక్షిణాఫ్రికా జట్టు

ఎల్గర్, మార్క్‌రమ్, జోర్జి, పీటర్సన్, హమ్జా, బెడింగామ్, వెరీస్, జాన్సెన్, ఎన్‌గిడి, రబడ, బర్గర్

Also read: Team India Bowlers: 2024లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించబోయే బౌలర్లు వీళ్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News