ధర్మశాల: భారత్-శ్రీలంక మధ్య తొలివన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు కళ్లెం వేయాలని లంక టీమ్ ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు.
టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్ క్రీజ్ లోకి వచ్చారు. మొదట శిఖర్ ధావన్ ఔటయ్యారు. తరువాత రోహిత్, దినేష్ కార్తిక్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యే , భువనేశ్వర్ కుమార్.. ఇలా ఒక్కోరు అవుట్ అయ్యారు. శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డే లో భారత్ 112 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇండియా స్కోర్ వివరాలు:
* మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 65 పరుగులు చేశాడు. 87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు.
* కులదీప్ యాదవ్ 19 పరుగులు చేశాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు.
* హార్దిక్ 10 పరుగులు చేసాడు.
* శ్రేయాస్ అయ్యర్ 9 పరుగులు చేసాడు.
* అర్జీ శర్మ 2 పరుగులు చేశాడు.
* ఎంకే పాండ్యే 2 పరుగులు చేసాడు.
*ధావన్, కార్తీక్, భువనేశ్వర్, బుమ్రా పరుగులేవీ చేయకుండా క్రీజులోనుంచి వెనుదిరిగారు.
శ్రీలంక బౌలింగ్: లక్మల్-4, మ్యాథ్యూస్-1, ఫెర్నాండో-1, పెరెరా-1, ధనుంజయ-1, పథిరనా-1