భారత్ Vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ గెలిచింది. రెండు మ్యాచ్ లను గెలుపొంది సిరీస్ ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మంగళవారం తిరువనంతపురంలో మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించడంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ విజయ ఢంకా మోగించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచినా న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ తీసుకుంది. భారత్ నిర్ణీత 8 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేయగా, 68 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేశారు.
మనీష్ పాండే 17 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 13, ఓపెనర్లు రోహిత్ శర్మ 8, శిఖర్ ధావన్ 6పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌథీ, సోదీలు రెండు చొప్పున, బౌల్ట్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు గ్రాండ్ హోమ్ 17, పిలిప్స్ 11, విలియమ్సన్ 8, మన్రో 7 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు బుమ్రా రెండు, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.