Mithali Raj Record: తెలుగు తేజం మిథాలీరాజ్ అద్భుతం, టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు

India Women vs SA Women Mithali Raj Record | టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా తెలుగు తేజం మిథాలీ రాజ్ ఈ అరుదైన ఫీట్ నెలకొల్పింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 12, 2021, 12:52 PM IST
  • టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది
  • 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న భారత తొలి మహిళా క్రికెటర్‌
  • దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో బౌండరీ ద్వారా ఈ ఫీట్ నమోదు
Mithali Raj Record: తెలుగు తేజం మిథాలీరాజ్ అద్భుతం, టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు

Mithali Raj Becomes First Indian Woman To Achieve This Record: టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా తరఫున 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా తెలుగు తేజం మిథాలీ రాజ్ ఈ అరుదైన ఫీట్ నెలకొల్పింది.

లక్నోలో దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో 28వ ఓవర్‌లో సఫారీ బౌలర్ అన్నే బాచ్ బౌలింగ్‌లో బౌండరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్(Mithali Raj) కాగా, ఓవరాల్‌గా రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ 309 మ్యాచ్‌లలో 10,273 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఛాంపియన్ క్రికెటర్ అని బీసీసీఐ ఉమెన్ అధికారిక ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది.

Also Read: Ind vs Eng 1st T20: ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో T20 World Cup ఛాన్స్ ఎవరిని వరించనుంది

మిథాలీ రాజ్ 212 వన్డేలలో 6938 పరుగులు సాధించింది. 89 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2,364 పరుగులు చేసింది. 10 టెస్టులలో 663 పరుగులు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మార్క్ చేరుకున్న తొలి భారత(Team India), ఓవరాల్‌గా రెండో మహిళా క్రికెటర్‌గా అద్భుత ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ మరుసటి బంతికే మిథాలీ రాజ్(56 బంతుల్లో 36) వికెట్ చేజార్చుకుని పెవిలియన్ చేరుకుంది.

Also Read: IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్స్ MS Dhoni ప్రాక్టీస్ షురూ, టైటిల్ లక్ష్యంగా సీఎస్కే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News