David Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్ మాజీ ఆటగాడు డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను నివసించే భవనంపై నుంచి కిందపడడంతో అతడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. అతడి మృతితో భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలిపారు.
Also Read: Smriti Mandhana: లేడీ కోహ్లీ స్మృతి మంధాన సంచలన రికార్డు.. భారత తొలి క్రికెటర్‌గా
కర్ణాటకకు చెందిన డేవిడ్ జాన్సన్ భారత క్రికెట్‌లో కొన్నాళ్లు ఆటగాడిగా కొనసాగారు. అనంతరం క్రికెట్ కోచ్‌గా కొనసాగుతున్నారు. బెంగళూరులోని కొత్తనూర్ ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవాడు. ఇంటికి సమీపంలోనే కోచింగ్ అకాడమీ నిర్వహిస్తున్నారు. కనకశ్రీ లేఔట్‌లోని అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తు నుంచి గురువారం ఆయన కిందపడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే సంఘటనా స్థలాన్ని చూస్తుంటే జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Uppal Stadium: ఊపిరి పీల్చుకున్న ఉప్పల్ స్టేడియం.. కోట్లలో ఉన్న కరెంట్ బిల్లులు చెల్లింపు
జాన్సన్ నేపథ్యం
భారత క్రికెట్‌లో డేవిడ్ జాన్సన్ ఆటగాడిగా కొనసాగారు. భారత జట్టు తరఫున రెండు టెస్టులు ఆడాడు. 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. కర్ణాటక క్రికట్ సంఘం బౌలింగ్ బృందంలో జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. భారత దిగ్గజ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేశ్ తదితరులతో కలిసి జాన్సన్ మ్యాచ్‌లు ఆడాడు.
ఆత్మహత్య?
జరిగిన సంఘటనను చూస్తే డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భారత జట్టుకు ఆడిన అనంతరం ఆయన క్రికెట్ కోచ్‌గా స్థిరపడ్డారు. తాను నివసిస్తున్న ఇంటికి సమీపంలోనే కోచింగ్ అకాడమీ ఏర్పాటుచేశారు. అయితే కొన్నాళ్లుగా అకాడమీ సక్రమంగా కొనసాగడం లేదని సమాచారం. ఆర్థికంగా నష్టాలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు కనిపిస్తోంది. నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
దిగ్గజాల సంతాపం
డేవిడ్ జాన్సన్ ఆకస్మిక మృతికి భారత దిగ్గజ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డేవిడ్ జాన్సన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూనే బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా డేవిడ్ జాన్సన్ మృతికి అంజలి ఘటించారు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు సంతాపం ప్రకటించారు.
Deeply saddened by the passing of my former teammate, David Johnson. He was full of life and never gave up on the field. My thoughts are with his friends and family.
— Sachin Tendulkar (@sachin_rt) June 20, 2024
Saddened by the passing away of David Johnson. May god give strength to his family and loved ones.
— Gautam Gambhir (@GautamGambhir) June 20, 2024
Saddened to hear the passing of my cricketing colleague David Johnson. Heartfelt condolences to his family. Gone too soon “ Benny”!
— Anil Kumble (@anilkumble1074) June 20, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter