IPL 2021: ఎంఎస్ ధోనీని ఆ యువ క్రికెటర్ దైవంగా ఆరాధిస్తాడు, పోలిక వద్దంటాడట

IPL 2021 Latest News: యువ ఆటగాళ్లు ధోనీని, సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. యువ వికెట్ కీపర్లు అతడిని గురువుగా భావిస్తారు. ఈ క్రమంలో కోల్‌కోతా నైట్ రైడర్స్ క్రికెటర్ నితీష్ రాణా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 17, 2021, 05:09 PM IST
  • టీమిండియా యువ క్రికెటర్లు ఎంఎస్ ధోనీని ఆదర్శంగా తీసుకుంటున్నారు
  • యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ ధోనీని దైవంగా భావిస్తున్నాడు
  • కోల్‌కోతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా పలు విషయాలు వెల్లడించాడు
IPL 2021: ఎంఎస్ ధోనీని ఆ యువ క్రికెటర్ దైవంగా ఆరాధిస్తాడు, పోలిక వద్దంటాడట

IPL 2021 Latest News: భారత క్రికెట్ జట్టుకు విజయవంతమైన సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఫలితాలు అందించాడు. టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా అరుదైన ఘనత ధోనీ సొంతం. అయితే యువ ఆటగాళ్లు ధోనీని, సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. యువ వికెట్ కీపర్లు అతడిని గురువుగా భావిస్తారు.

టీమిండియా యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్‌ను ఎంఎస్ ధోనీ వారసుడు, శిష్యుడిగా పరిగణిస్తారు. అయితే రంజీల్లో పంత్ ఢిల్లీ టీమ్‌ సహచరుడు, కోల్‌కోతా నైట్ రైడర్స్ క్రికెటర్ నితీష్ రాణా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని యువ క్రికెటర్ రిషబ్ పంత్ దైవంగా భావిస్తాడని ఐపీఎల్ 2021 క్రికెటర్ నితీష్ రానా వెల్లడించాడు. ధోనీ నుంచి పంత్ చాలా నేర్చుకున్నాడని, మాజీ కెప్టెన్‌ను ఆటలో ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముందుకు సాగుతున్నాడని ఇండియా టీవీతో మాట్లాడుతూ పలు ఇతర విషయాలు తెలిపాడు.

Also Read: BCCI Lifts Ban On Ankeet Chavan: అంకిత్ చవాన్‌పై నిషేధం ఎత్తేసిన బీసీసీఐ, ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ మచ్చ

పంత్ నిద్రలేస్తూనే ధోనీ ముఖం చూడాలని భావిస్తాడు. ఆ విషయం గతంలో నాకు ఓసారి చెప్పాడు. అభిమానులు నన్ను మహీ భాయ్‌తో ఎందుకు పోల్చుతున్నారు. ధోనీ అంత విలువైన ఆటగాడిని కాదు. ధోనీలాంటి అటగాడితో నన్ను పోల్చవద్దు. అలా చేస్తే నేను బ్యాటింగ్ కూడా చేయలేను. ధోనీ భాయ్ నాకు దైవంతో సమానమని’ రిషబ్ పంత్ (Rishabh Pant) చెప్పిన మాటల్ని నితీష్ రానా గుర్తుచేసుకున్నాడు. 23 ఏళ్ల రిషబ్ పంత్ ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించి జట్టుకు అద్బుతమైన విజయాలు అందించి కెప్టెన్సీలోనూ మంచి మార్కులు కొట్టేశాడు.

Also Read: Team India For WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు BCCI ఎంపిక చేసిన ఆటగాళ్లు వీరే

గత ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయాడు. ఫిట్‌నెస్ సాధించిన తరువాత పంత్‌కు అన్ని ఫార్మాట్లలో అవకాశాలు వస్తున్నాయి. అయితే పంత్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువేనని, విమర్శలు వచ్చినా ఎదుర్కొనే మనస్తత్వం పంత్‌దన్నాడు. ఒక్క గొప్ప ఇన్నింగ్స్ ఆడితే విమర్శలకు సమాధానం చెప్పినట్లేనని పంత్ భావిస్తాడని, తరువాత మ్యాచ్‌లో శతకం సాధించాడని ఆస్ట్రేలియా పర్యటన గురించి తనతో చర్చించాడని నితీష్ రానా వివరించాడు. తనపై వచ్చిన మీమ్స్ సైతం తనకు చూపించేవాడని చెప్పుకొచ్చాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News