IPL 2021: గురుశిష్యుల మధ్య పోరులో శిష్యుడు విజయం సాధించాడు. సీనియర్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన ఐపీఎల్ 2వ మ్యాచ్‌లో విజయంతో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌ను ప్రారంభించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. శనివారం నాడు ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి తప్పిదానికి వివో ఐపీఎల్ 2021(IPL 2021)లో తొలి మ్యాచ్‌లోనే జరిమానా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ప్రకారం ధోనీకి జరిమానా విధించినట్లు అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో డకౌటైన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ట్రోలింగ్ కొనసాగుతోంది.
Also Read: IPL 2021 Funny Memes: ఐపీఎల్ 2021పై వైరల్ అవుతున్న మీమ్స్, జోక్స్ మీకోసం
ఐపీఎల్ రూల్స్ ప్రకారం గంటకు 14.1 ఓవర్లు బౌలింగ్ కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో 90వ నిమిషంలోపుగానీ, ఆ సమయానికి 20వ ఓవర్ బౌలింగ్ ప్రారంభించాలి. ఒకవేళ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండవ తప్పిదం జరిగితే రూ.24 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇతర జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.6 లక్షలుగానీ, లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫీజు (ఇందులో ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తారు. మూడోసారి తప్పిదం జరిగితే కెప్టెన్ ఎంఎస్ ధోనీ(CSK Captain MS Dhoni)పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు రూ.30 లక్షల జరిమానా, ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: MI vs RCB IPL 2021: ఐపీఎల్ ప్రారంభానికి ముందే తన లక్ష్యమేంటో చెప్పిన మహమ్మద్ సిరాజ్
ఐపీఎల్ 2020 సీజన్‌లో నిరాశపరిచిన ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2021ను డకౌట్‌తో మొదలుపెట్టాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 188 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా 13.3 ఓవర్లలో 138 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మరో 8 బంతులు మిగిలుండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ధోనీ సారథ్యంలోని సీఎస్కేపై ఘన విజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook