IPL 2022 GT vs RR Qualifier 1, Gujarat Titans won toss: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 క్వాలిఫైయర్ 1 గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ఆరంభం అవనుంది. ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురవడం, ఆకాశం పూర్తిగా మేఘాలు కమ్ముకోవడంతో.. మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే సాయత్రం వరణుడు కరుణించడంతో.. సమయానికే టాస్ పడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30కు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
గత మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ వృద్ధిమాన్ సాహా పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. పేసర్ లోకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ ఆడుతున్నట్లు తెలిపాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పేర్కొన్నాడు. ఇరు జట్లు మంచి ఫామ్ మీదున్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌లో బెర్తు ఖాయం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్ తలపడుతుంది.
🚨 Team News 🚨
1⃣ change for @gujarat_titans as Alzarri Joseph is named in the team. @rajasthanroyals remain unchanged.
Follow the match ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR
A look at the Playing XIs 🔽 pic.twitter.com/9w9kJLw0Cr
— IndianPremierLeague (@IPL) May 24, 2022
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్, ఓబెడ్ మెక్‌కాయ్.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, యాష్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook