KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. షెల్డన్ ఔట్! రబాడ వచ్చేశాడు!!

IPL 2022, KKR vs PBKS Playing 11 is Out. మరికొద్ది సేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 07:38 PM IST
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
  • రబాడ వచ్చేశాడు
  • కోల్‌కతా, పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్
KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. షెల్డన్ ఔట్! రబాడ వచ్చేశాడు!!

IPL 2022, KKR vs PBKS Playing 11 is Out: ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో కేకేఆర్ బరిలోకి దిగుతోంది. షెల్డన్ జాక్సన్ స్థానంలో శివమ్ మావి జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంజాబ్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. సందడిప్ శర్మ స్థానంలో కగిసో రబాడ ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌ ఆరంభ మ్యాచులో చెన్నైని ఓడించిన కోల్‌కతా.. బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచులో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. మరోవైపు బెంగళూరుతో జరిగిన గత మ్యాచులో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ 19 ఓవర్లలోనే ఛేదించి మంచి ఊపులో ఉన్నారు. ముంబైలోని వాంఖడే స్డేడియంలో జరుగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.   

కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 29సార్లు తలపడగా.. కేకేఆర్‌ 19సార్లు, పంజాబ్‌ 10సార్లు విజయాలు సాధించాయి. గత సీజన్‌లో ఇరు జట్లు రెండో సార్లు పోటీపడగా.. కేకేఆర్‌, పంజాబ్‌ చెరో విజయాన్ని అందుకున్నాయి. ఈరోజు కేకేఆర్‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగింది.      

తుది జట్లు: 
కోల్‌కతా:  వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్య రహానె, నితీశ్ రాణా, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), సామ్‌ బిల్లింగ్స్‌ (వికెట్ కీపర్‌), ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్ యాదవ్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి.   
పంజాబ్:  మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, భనుక రాజపక్స (వికెట్ కీపర్‌), షారుఖ్‌ ఖాన్‌, ఓడియన్ స్మిత్‌, రాజ బవా, ఆర్ష్‌దీప్ సింగ్‌, హర్‌ప్రీత్ బ్రర్‌, కగిసో రబాడ, రాహుల్ చహర్‌.  

Also Read: Ugadi 2022 Panchangam: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? లేదా?.. ఉగాది పంచాంగం ఏం చెబుతోందంటే?

Also Read: Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News