Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా

Bank Holidays: బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఈ అప్​డేట్​ మీకోసమే. రేపటి నుంచి బ్యాంకులు వరుస సెలవులో ఉండనున్నాయి. సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 06:54 PM IST
  • రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు
  • పండుగలకు కలిసొచ్చిన ఆదివారం..
  • తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా రేపు హాలిడే..
Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా

Bank Holidays: నేటి (ఏప్రిల్​ 1)నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది. దీనితో నేడు దేసవ్యాప్తంగా బ్యాంకులన్నీ.. సెలవులో ఉండటం లేదా పాక్షికంగా కార్యకలాపాలు సాగించడం వంటివి చేశాయి. ఇక రేపు కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.

ఏ ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు..

సాధారణంగా ప్రతి నెల మొదటి శనివారం బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేస్తాయి. ఏదైనా ప్రత్యేకించి పండుగలు లేదా ప్రముఖుల పుట్టిన రోజుల వంటి సందర్భాలు ఉంటే సెలవు ప్రకటిస్తాయి. అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు.

అలానే ఈసారి ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా సహా వివిధ కారణాలతో పలు రాష్ట్రాల్లో బ్యాంకులు రేపు (ఏప్రిల్ 2) సెలవులో ఉండనున్నాయి.

ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవు అంటే?

తెలంగాణ, ఆధ్ర ప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, గోవాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రేపు సెలవులో ఉంటాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సెలవుల జాబితాను నోటిఫై చేసింది.

సెలవులో ఉన్నా..

బ్యాంకులు సెలవులో ఉన్నా ఆన్​లైన్​ లావాదేవీలపై ఎలాంటి ప్రబావం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్​, ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ వంటి సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి.

అయితే రుణాల చెల్లింపు, చెక్​ క్లియరెన్స్​ వంటి వాటికోసం కచ్చితంగా బ్యాంక్​కు వెళ్లాల్సి వస్తే.. ముందుగానే ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం.

ఏప్రిల్​ 2తో పాటు.. 3న ఆదివారం కారణంగా బ్యాంకులు సాధారణంగానే సెలవులో ఉంటాయి. ఆ తర్వాత 4, 5 తేదీల్లోనూను రాష్ట్రాల వారీగా బ్యాంకులు సెలవులో ఉంటాయి.

Also read: Pan aadhaar link: పాన్​-ఆధార్ లింక్​ గడువు ముగిసింది- ఇకపై రూల్స్ ఇలా..

Also read: ATF Price hike: కొత్త రికార్డు స్థాయికి ఏటీఎఫ్​ ధర- పెరగనున్న విమాన టికెట్ల ధరలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News