Ahmedabad Titans: ఐపీఎల్ కొత్త టీమ్ పేరు 'అహ్మదాబాద్ టైటాన్స్'.. ప్రకటించిన సీవీసీ క్యాపిటల్

Ahmedabad Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా ప్రవేశించనున్న అహ్మదాబాద్ టీమ్ పేరును సీవీసీ క్యాపిటల్ యాజమాన్యం ప్రకటించింది. తమ టీమ్ పేరును 'అహ్మదాబాద్ టైటాన్స్'గా ఖరారు చేస్తున్నట్లు సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 08:01 AM IST
    • కొత్త ఐపీఎల్ టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ
    • అహ్మదాబాద్ టైటాన్స్ గా టీమ్ కు నామకరణం
    • ఫిబ్రవరి 12, 13న జరగనున్న వేలంగా పాల్గొనేందుకు సంసిద్ధం
Ahmedabad Titans: ఐపీఎల్ కొత్త టీమ్ పేరు 'అహ్మదాబాద్ టైటాన్స్'.. ప్రకటించిన సీవీసీ క్యాపిటల్

Ahmedabad Titans: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ఈ మెగా వేలానికి 10 ఫ్రాంఛైజీలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఉన్న 8 టీమ్స్ తో పాటు ఇటీవలే కొత్తగా ఫ్రాంఛైజీలను దక్కించుకున్న లక్నో, అహ్మదాబాద్ టీమ్స్ పాల్గొననున్నాయి. 

ఈ నేపథ్యంలో తమ టీమ్స్ కు పేరు పెట్టే పనిలో పడ్డారు ఇరు ఫ్రాంఛైజీలు. అయితే లక్నో జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అని నామకరణం చేసినట్లు ఆ టీమ్ యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. కానీ, అహ్మాదాబాద్ మేనేజ్ మెంట్ తమ టీమ్ పేరును ప్రకటించడంలో జాప్యం చేసింది. కానీ, ఎట్టకేలకు తమ జట్టు పేరును ప్రకటిస్తున్నట్లు సీవీసీ క్యాపిటల్ సోమవారం రాత్రి వెల్లడించింది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి 'అహ్మదాబాద్ టైటాన్స్' అనే పేరును పెట్టినట్లు ట్వీట్ చేసింది. 

అహ్మదాబాద్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీవీసీ క్యాపిటల్‌ రూ.5625 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న అహ్మదాబాద్‌ జట్టులో పాండ్యతో పాటు రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. 

అయితే ఈ వేలంలో దాదాపుగా 1,214 మంది పేరును నమోదు చేసుకున్నట్లు ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ జాబితాను 590కి కుదించిన విషయం అందరికి తెలిసిందే. ఈ జాబితాలో 228 మంది అంతర్జాతీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 

మరో ఏడుగురు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు. ఈ మెగా వేలంలో 370 మంది భారత క్రికెటర్లతో పాటు 220 మంది విదేశీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

Also Read: Shaik Rasheed: చిన్న ఇల్లు కూడా లేదు..ఆ డబ్బుతో ఓ ఇల్లు కొంటాను..భారత అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్

Also Read: Tata Open 2022: టాటా ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేతగా బోపన్న జోడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Trending News